వివాదాలకి కేరాఫ్ అడ్రస్ రామ్ గోపాల్ వర్మ, మరో వివాదాస్పద అంశంతో ప్రేక్షకుల ముందుకి రాబోతున్నాడు. సంచలన సంఘటనల్ని కథాంశాలుగా తీసుకుని సినిమాలుగా తీర్చిదిద్దే రామ్ గోపాల్ వర్మ, తెలుగు రాష్ట్రాలని షేక్ చేసిన ప్రణయ్ పరువు హత్యపై సినిమా తెరకెక్కిస్తున్నాడు. మర్డర్ అనే టైటిల్ తో రూపొందుతున్న ఈ చిత్రం నుండి ఫాదర్స్ డే సందర్భంగా ఫస్ట్ లుక్ పోస్టర్ ని వదిలాడు.
మర్డర్..కుటుంబ కథా చిత్రమ్ అనే ఉపశీర్షికతో తెరకెక్కుతున ఈ సినిమాలో తండ్రీ మారుతీరావు, కూతురు అమృత ల మధ్య ఉండే రిలేషన్ ని చూపించే విధంగా ఈ సినిమా ఉండబోతున్నట్లు తెలుస్తుంది. మిర్యాల గూడకి చెందిన మారుతీరావు కూతురు అమృత.. ప్రణయ్ ని కులాంతర వివాహం చేసుకుందన్న కారణంగా పరువు పోయిందని హత్య చేయించిన వైనం తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపింది.
అయితే ఇటీవలే మారుతీరావు ఆత్మహత్య చేసుకుని మరణించాడు. ప్రస్తుతం ఈ సంఘటనల్ని ఆధారంగా చేసుకుని రామ్ గోపాల్ వర్మ సినిమా తెరకెక్కిస్తున్నాడు. నట్టీస్ ఎంటర్ టైన్ మెంట్స్, క్విట్టీ ఎంటర్ టైన్ మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాని ఆనంద చంద్ర దర్శకత్వం వహిస్తున్నాడు. మరి ఈ సినిమా ద్వారా ఇంకెన్ని సంచలనాలు సృష్టిసాడో చూడాలి. ఈ సినిమాలో మారుతీరావుగా శ్రీకాంత్ అయ్యంగార్ నటిస్తుండగా, అమృత గా సాహితి కనిపిస్తుంది.