Advertisementt

‘పెంగ్విన్’ని అలా వదిలేశారేంటి..?

Mon 22nd Jun 2020 08:46 AM
penguin,keerthi suresh,amazon prime,promotions,penguin producers  ‘పెంగ్విన్’ని అలా వదిలేశారేంటి..?
No Promotions to Keerthi Suresh Penguin ‘పెంగ్విన్’ని అలా వదిలేశారేంటి..?
Advertisement
Ads by CJ

ప్రస్తుతం ఓ మాదిరి, చిన్న సినిమాలన్నీ ఓటిటి వైపుకు మళ్లుతున్నాయి. నిన్నటివరకు ససేమిరా అన్న దర్శకులు, హీరోయిన్స్ కూడా నేడు ఓటిటి వైపే చూస్తున్నారు. ప్రస్తుతం పరిస్థితి అలానే ఉంది. అన్ని పూర్తి చేసుకుని విడుదల కోసం వెయిట్ చేసి చివరికి ఓటిటికి వదులుతున్నారు. తాజాగా కీర్తి సురేష్ నటించిన పెంగ్విన్ శుక్రవారం ఓటిటి అమెజాన్ ప్రైమ్ నుండి విడుదలైంది. ఈ సినిమా విడుదలకు ముందు కీర్తి సురేష్ ఈ సినిమాని బాగానే ప్రమోట్ చేసింది. అయితే ప్రస్తుతము అన్ని రెడీ చేసుకుని కూర్చున్న నిర్మాతలను ఓటిటి వైపు లాగుతున్నారు. అయితే ఓటిటిలో విడుదల చేసే మీడియం సినిమాల విషయంలో దర్శకులు కూడా కాస్త తగ్గుతున్నారు. ఎందుకంటే థియేటర్స్ లో ఆడుతుందో లేదో అనే మీమాంసలో ఓటిటికి ఇచ్చేస్తున్నారు. తాజాగా పెంగ్విన్ అందుకే ఓటిటి కి ఇచ్చేసినట్టుగా కనిపిస్తుంది. ఎందుకంటే ఇలాంటి సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలు ఎప్పుడూ కుప్పలు తెప్పలుగా వస్తూనే ఉన్నాయి. ఇలాంటి సినిమాలకు కథ, కథనాలు బలంగా ఉండాలి. కానీ పెంగ్విన్ ఫస్టాఫ్‌ని బాగా హ్యాండిల్ చేసిన దర్శకుడు సెకండ్ హాఫ్‌పై గ్రిప్ కోల్పోయాడు.

ఇలాంటి సినిమాని మహానటి కీర్తి ఎలా ఒప్పుకుందో? సినిమాలో విషయం లేకనే సినిమాని ఓటిటి కి ఇచ్చేశారనిపిస్తుంది. అయితే ఓటిటి వాళ్ళుకూడా నిర్మాతలను బుట్టలో వెయ్యడానికి గాను... కాస్త ఎక్కువ మొత్తం ముట్టజెబుతున్నారు. అందులో భాగంగానే కీర్తి సురేష్ పెంగ్విన్ కి 7.5 కోట్ల భారీ డీల్ నిర్మాతలకు ఇచ్చినట్టుగా తెలుస్తుంది. విడుదలకు ముందు హడావిడి చేసిన కీర్తి సురేష్ అండ్ టీం.. విడుదలై యావరేజ్ టాక్ వచ్చాక మాయమయ్యారు. అంటే థియేటర్స్‌లో విడుదలైతే ఏ సక్సెస్ మీటో, ఏ హిట్ ప్రెస్ మీటో అని పెట్టేవారు. కానీ అమెజాన్‌లో విడుదలైంది కాబట్టి.. ఇక ఎలాంటి హడావిడి చెయ్యక్కర్లేదు అనుకున్నారేమో మూవీ టీం. అందుకే అమ్మేసి చేతులు దులిపేసుకున్నారు. అయినా డిజిటల్ ప్లాట్ ఫార్మ్స్ వాళ్ళకి ఇలానే జరగాలిలే.

No Promotions to Keerthi Suresh Penguin:

After Release No Promotions to Keerthi Suresh Penguin

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ