Advertisementt

పుష్ప సినిమాకి అల్లు అర్జున్ రెమ్యునరేషన్..

Sun 21st Jun 2020 11:20 AM
allu arjun,pushpa,sukumar,mythri movie makers  పుష్ప సినిమాకి అల్లు అర్జున్ రెమ్యునరేషన్..
Allu Arjun remuneration for Pushpa.. పుష్ప సినిమాకి అల్లు అర్జున్ రెమ్యునరేషన్..
Advertisement
Ads by CJ

అల వైకుంఠపురములో వంటి బ్లాక్ బస్టర్ సినిమా తర్వాత అల్లు అర్జున్ చేస్తున్న పుష్పపై అభిమానుల్లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. సుకుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా పాన్ ఇండియా రేంజ్ లో రూపొందనుంది. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కే ఈ సినిమాలో బన్నీ లారీ డ్రైవర్ గా కనిపించనున్నాడు. హీరోయిన్ గా రష్మిక మందన్న నటిస్తుంది. తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మళయాలం, హిందీ భాషల్లో విడుదలయ్యే ఈ సినిమాకి అల్లు అర్జున్ ఎంత రెమ్యునరేషన్ తీసుకుంటున్నాడనేది ఆసక్తిగా మారింది.

తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాకి బన్నీ 35 కోట్ల పారితోషికం తీసుకుంటున్నాడని టాక్ వినిపిస్తుంది. బన్నీకి తెలుగుతో పాటు మళయాలంలోనూ మంచి మార్కెట్ ఉంది. అదీగాక అల్లు అర్జున్ హిందీ డబ్బింగ్ చిత్రాలకి రికార్డు స్థాయిలో వ్యూస్ వస్తుంటాయి. అందువల్ల నార్త్ లో సైతం పుష్ప సినిమాకి మంచి డిమాండ్ ఏర్పడే అవకాశం ఉంది. 

ప్రస్తుతానికి కరోనా కారణంగా ఈ సినిమా షూటింగ్ ఇంకా స్టార్ట్ కాలేదు. ఆగస్టు చివరి వారం నుండైనా లేదా సెప్టెంబరు మొదటి వారంలోనైనా షూటింగ్ మొదలయ్యే అవకాశాలు ఉన్నాయి. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ సినిమాకి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. 

Allu Arjun remuneration for Pushpa..:

Allu Arjun remuneration for Pushpa..

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ