రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ఆర్ ఆర్ ఆర్ సినిమా నుండి అల్లూరి సీతారామరాజుగా రామ్ చరణ్ లుక్ వదిలినప్పటి నుండీ కొమరం భీమ్ గా ఎన్టీఆర్ లుక్ ఎలా ఉంటుందోనన్న ఆసక్తితో అభిమానులు ఎంతో ఆశగా ఎన్నో రోజుల నుండి ఎదురుచూస్తున్నారు. మే 20వ తేదీ ఎన్టీఆర్ పుట్టినరోజున కొమరం భీమ్ ని పరిచయం చేస్తారనుకుంటే నిరాశే ఎదురయింది. లాక్డౌన్ వల్ల ఎన్టీఆర్ ఫస్ట్ లుక్ కి సంబంధించిన వీడియో రెడీ కాలేకపోవడంతో రిలీజ్ చేయలేమని సమాధానం ఇచ్చారు.
అయితే ఒక్కసారి మళ్ళీ షూటింగ్స్ మొదలైతే ఎన్టీఆర్ లుక్ విడుదల చేస్తామని ప్రామిస్ కూడా చేసారు. కానీ ఆ ప్రామిస్ నిలబెట్టుకునేలా కనబడట్లేదు. తెలంగాణ ప్రభుత్వం షూటింగ్స్ కి అనుమతులు ఇచ్చినా తర్వాత రాజమౌళి టెస్ట్ షూట్ కోసం అన్నీ సిద్ధం చేసుకున్న సంగతి తెలిసిందే. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో షూటింగ్ అంటే అనవసర రిస్కేమో అన్న భావం కలగడం వల్ల ఆర్ ఆర్ ఆర్ షూటింగ్ మరికొన్ని రోజుల వరకి స్టార్ట్ అయ్యేలా కనిపించడం లేదు.
సో ఎన్టీఆర్ లుక్ కోసం ఎదురుచూసే వారికి ఇంకా నిరీక్ష్ణణ తప్పేలా కనబడట్లేదు.భీమ్ ఫర్ రామరాజుని చూసిన ప్రేక్షకులు రామరాజు ఫర్ భీమ్ చూడాలంటే ఇంకొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే అంటున్నారు. కీరవాణి సంగీతం అందిస్తున్న ఈ సినిమాని డీవీవీ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై డీవీవీ దానయ్య నిర్మిస్తున్నారు.