Advertisementt

ఫైటర్ సినిమాలో ఛేంజెస్.. క్లారిటీ ఇచ్చిన ఛార్మీ..

Sat 20th Jun 2020 02:41 PM
charmi,puri jagannadh,vijay devarakonda,puri connects,karan johar  ఫైటర్ సినిమాలో ఛేంజెస్.. క్లారిటీ ఇచ్చిన ఛార్మీ..
Charmi given clarity about changes in Fighter.. ఫైటర్ సినిమాలో ఛేంజెస్.. క్లారిటీ ఇచ్చిన ఛార్మీ..
Advertisement
Ads by CJ

 

 

డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ ఇస్మార్ట్ శంకర్ విజయంతో మళ్ళీ సక్సెస్ బాట పట్టాడు. ఎనర్జిటిక్ స్టార్ రామ్ హీరోగా నటించిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ విజయం సాధించింది. అయితే ఈ సినిమా తర్వాత పూరి జగన్నాథ్ కి రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ దొరికాడు. విజయ్ హీరోగా పాన్ ఇండియా రేంజ్ లో ఛార్మి సహ నిర్మాతగా పూరి కనెక్ట్స్ బ్యానర్, కరణ్ జోహార్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఫైటర్  సినిమాలో అనన్య పాండే హీరోయిన్ గా నటిస్తుంది.

అయితే ఇప్పటి వరకూ ముంబైలోనే షూటింజ్ జరుపుకున్న ఈ చిత్రం కరోనా కారణంగా షూటింగ్ ని నిలిపివేసింది. ప్రస్తుతం లాక్డౌన్ టైమ్ లో సినిమా ఇండస్ట్రీల్లో జరిగిన అనేక మార్పుల వల్ల ఫైటర్ మూవీ స్క్రిప్టులో అనేక మార్పులు చేసినట్లు వార్తలు వచ్చాయి. లాక్డౌన్ టైమ్ లో పూరి జగన్నాథ్ ఫైటర్ స్క్రిప్టుని ఛేంజ్ చేసాడని అన్నారు. అయితే తాజాగా ఈ విషయమై స్పందించిన ఛార్మి మార్పులు జరిగాయన్న వార్తలపై క్లారిటీ ఇచ్చింది.

ఛార్మి బదులిస్తూ, ఫైటర్ స్క్రిప్టులో ఎలాంటి మార్పులు జరగలేదు. అది బ్లాక్ బస్టర్ స్క్రిప్టు. అందువల్ల అందులో ఎలాంటి మార్పులు చేసే అవకాశమే లేదు. అలాంటి వార్తలని నమ్మకండి అని కోరింది.  కరోనా సమస్యలు తగ్గిన తర్వాత తిరిగి మళ్ళీ షూటింగ్ స్టార్ట్ అవుతుందని తెలిపింది.

Charmi given clarity about changes in Fighter..:

Charmi given clarity about changes in Fighter..

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ