యాంకర్ అనసూయ టెలివిజన్ ప్రేక్షకులకే కాదు వెండితెర ప్రేక్షకులకి కూడా సుపరిచితమే. టెలివిజన్ మీద తనదైన గ్లామర్ తో ప్రేక్షకులని మంత్ర ముగ్ధులను చేసే ఈ హాట్ యాంకర్ తన గ్లామర్ సీక్రెట్ ని బయటపెట్టింది. కరోనా వల్ల షూటింగులు లేక ఇంట్లోనే కాలం గడుపుతున్న అనసూయ సోషల్ మీడియాలో చాలా ఆక్టివ్ గా ఉంటుంది. సోషల్ మీడియా వేదికగా తన అభిమానులతో ఎప్పటికప్పుడు తన అభిప్రాయాలను షేర్ చేసుకుంటూ ఉంటుంది.
తాజాగా అనసూయ తన గ్లామర్ రహస్యం బయటపెట్టింది. ప్రతీ రోజూ సరైన వ్యాయామంతో పాటు డ్రైఫ్రూట్స్ తీసుకోవడం, రోజూ ఒక గ్లాసు రెడ్ వైన్ తీసుకోవడం అలవాటుగా మారిందని చెప్పుకొచ్చింది. ఆరోగ్యపరంగానూ రెడ్ వైన్ గుండెకి మంచిదన్న కారణంగా అలవాటు చేసుకుందట. అలాగే రెడ్ వైన్ ఆకలిని బాగా తగ్గిస్తుందట. ఉపవాసాల గురించి మాట్లాడితే వాటి గురించి నేను పట్టించుకోనని బదులిచ్చింది..
మొత్తానికి యాంకర్ అనసూయ గ్లామర్ సీక్రెట్ రెడ్ వైన్ అయ్యుంటుందని అనుకుంటున్నారు. ప్రస్తుతం ఇటు జబర్దస్త్ లో యాంకర్ గా చేస్తూనే క్రిష్ణ వంశీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న రంగమార్తాండ సినిమాలోనూ నటిస్తుంది.