Advertisementt

నిత్యామీనన్‌కు ఈ కోరిక ఎలా పుట్టిందో?

Sat 20th Jun 2020 09:34 AM
nithya menon,director,megaphone,heroine nithya menon,actress  నిత్యామీనన్‌కు ఈ కోరిక ఎలా పుట్టిందో?
Nithya Menon Interest on MegaPhone నిత్యామీనన్‌కు ఈ కోరిక ఎలా పుట్టిందో?
Advertisement
Ads by CJ

నిత్యామీనన్ నటనతో అద్భుతాలు సృష్టస్తుంది. అలా అని గ్లామర్ షో చెయ్యదు... అందాలు ఆరబోయడంలో నిత్యామీనన్ కి కొన్ని పరిధులున్నాయి. అందుకే నిత్యామీనన్ కి అవకాశాలు కూడా తగ్గాయి. స్టార్ హీరోల సినిమాల్లో నిత్యామీనన్‌కి అవకాశాలు రాకపోవడానికి కారణం కూడా ఆమె గ్లామర్ షో చెయ్యదు.. బరువు కంట్రోల్ చేయదనే. అయితే నిత్యా మీనన్ కూడా వచ్చిన కథలు వచ్చినట్టుగా అంగీకరించకుండా.. కథ నచ్చి, తన పాత్ర నచ్చితేనే సినిమాలు చేస్తుంది. అందుకే నిత్యామీనన్ చేసిన సినిమాలు చాలా తక్కువ. అయితే తాజాగా నిత్యా మీనన్ కొత్త అవతారం ఎత్తబోతుందట.

తాను నటిస్తున్న సినిమాల షూటింగ్స్ లో తన సీన్స్ కి బ్రేక్ వచ్చినప్పుడు కెమెరా వెనుక నిలబడి చిత్రీకరణ తీరును నిత్య పరిశీలిస్తూ ఉంటుందట. ఈ అభిరుచితోనే నిత్యామీనన్ దర్శకురాలు కావాలని కోరిక పుట్టిందట. అందుకే ఈ లాక్ డౌన్ సమయంలో నిత్యామీనన్ కొన్ని కథలు రాసుకుని ఫుల్ స్క్రిప్ట్ కూడా తయారు చేసుకుందట. ప్రస్తుతం తాను నటిస్తున్న సినిమాలు పూర్తి కాగానే నిత్యా మీనన్ దర్శకత్వం వైపు తన చూపు మరల్చి.. మెగా ఫోన్ పట్టాలని చూస్తుందట.

Nithya Menon Interest on MegaPhone :

soon.. Nithya Menon Turns Director

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ