మంచు విష్ణు కథానాయకుడిగా తెలుగు, ఇంగ్లీష్ భాషల్లో తెరకెక్కుతున్న మోసగాళ్ళు చిత్రం నుండి తాజాగా ఒక పోస్టర్ రిలీజ్ అయింది. గత కొన్ని రోజులుగా వరుస ఫ్లాపులతో సతమతమవుతున్న మంచు విష్ణు, మోసగాళ్ళు చిత్రంపై భారీ ఆశలు పెట్టుకున్నాడు. అమెరికాలో జరిగిన అతిపెద్ద ఐటీస్కామ్ గురించిన కథాంశంతో వస్తున్న ఈ సినిమా విష్ణు కెరీర్లో ప్రత్యేకమైనదిగా నిలవనుందని అంటున్నారు..
అయితే ఈ సినిమాలో హీరోయిన్ కాజల్ అగర్వాల్ కూడా నటిస్తుంది. విష్ణుకి చెల్లెలిగా కాజల్ కనిపించనుందని టాక్. అయితే జూన్ 19న ఆమె పుట్టినరోజుని పురస్కరించుకుని మోసగాళ్ళు చిత్రం నుండి ఒక పోస్టర్ ని రిలీజ్ చేశారు. ఈ పోస్టర్ లో సగభాగం మంచు విష్ణూ కనిపిస్తుండగా, మరో సగభాగం కాజల్ కనిపిస్తుంది. అర్జున్ గా మంచు విష్ణు, అనూ గా కాజల్ తమ తమ పాత్రల్లో కనిపించనున్నారు.
ఈ పోస్టర్ ప్రేక్షకులని బాగానే ఆకర్షిస్తుంది. బ్యాగ్రౌండ్ లో డాలర్ నోట్లు కిందపడుతున్నట్లుగా చూపించడం సినిమా థీమ్ ని తెలియజేస్తుంది. బాలీవుడ్ నటుడు సునీల్ శెట్టి ప్రత్యేక పాత్రలో కనిపించబోతున్న ఈ సినిమాని జెఫ్రీ చిన్ దర్శకత్వం వహిస్తున్నాడు.