పవర్‌స్టార్ పవన్ కల్యాణ్‌తో రెండు సినిమాలు చేసింది అందాల తార శ్రుతీ హాసన్. వాటిలో ‘గబ్బర్‌సింగ్’ మూవీ బ్లాక్‌బస్టర్ కాగా, ‘కాటమరాయుడు’ యావరేజ్‌గా ఆడింది. సందర్భవశాత్తూ తెలుగులో ఆమె చివరి సినిమా కూడా ‘కాటమరాయుడు’ (2017). ఆ సినిమా తర్వాత అదే ఏడాది విడుదలైన బాలీవుడ్ మూవీ ‘బెహెన్ హోగీ తేరీ’లో కనిపించిన ఆమె ఇంతదాకా మరో సినిమాలో కనిపించలేదు. ఇప్పుడు రవితేజ సరసన నటిస్తోన్న ‘క్రాక్’ మూవీ ద్వారా రి-ఎంట్రీ ఇస్తోంది. తాజాగా ఇద్దరు దర్శకులు శ్రుతిని అప్రోచ్ అయ్యారు. ఆ ఇద్దరూ ఇదివరకు ఆమెతో కలిసి పనిచేసిన దర్శకులే. అంతే కాదు.. ఇప్పుడు వాళ్లు అప్రోచ్ అయ్యింది ఒకే హీరో నటిస్తున్న సినిమాల కోసం కావడం ఇంకో విశేషం. అవును. ఆ సినిమాల్లో ఒకటి శ్రీరామ్ వేణు రూపొందిస్తోన్న ‘వకీల్ సాబ్’ కాగా, మరొకటి హరీష్ శంకర్ డైరెక్షన్‌లో పవన్ కల్యాణ్ చేయనున్న సినిమా.
గతంలో శ్రీరామ్ వేణు డైరెక్షన్‌లో ‘ఓ మై ఫ్రెండ్’ సినిమాలో హీరోయిన్‌గా నటించింది శ్రుతి. ‘వకీల్ సాబ్’లో కొద్ది నిమిషాల సేపు కనిపించే స్పెషల్ రోల్ కోసం ఆమెను వేణు సంప్రదించాడనీ, అయితే శ్రుతి ఆ ఆఫర్‌ను తిరస్కరించిందనీ ఫిల్మ్‌నగర్‌లో గుసగుసలు వినిపిస్తున్నాయి. కారణం.. ఆ స్పెషల్ రోల్ తనకు తగినది కాదని ఆమె భావించడమే అంటున్నారు. ఇంతకీ ఆ రోల్.. పవన్ కల్యాణ్ భార్య అనీ, అయితే సినిమా అంతా ఆమె పేషెంట్‌గా బెడ్‌పై పడుకొని కనిపించాల్సి ఉంటుంది కాబట్టి.. అలాంటి రోల్ చేయడానికి ఆమె సిద్ధంగా లేదనీ, అందుకే తిరస్కరించిందనీ చెప్పుకుంటున్నారు. దిల్ రాజు సైతం ఆమెను కన్విన్స్ చెయ్యాలని చూశాడనీ, అయినా ఆమె అంగీకరించలేదనేది ఇన్‌సైడర్స్ మాట. దిల్ రాజు బేనర్‌లో శ్రుతి ఇదివరకు ‘ఓ మై ఫ్రెండ్’, ‘ఎవడు’, ‘రామయ్యా వస్తావయ్యా’ సినిమాలు చేసింది.
కాగా పవన్ కల్యాణ్‌తో హరీష్ శంకర్ రూపొందించే సినిమాని ఆమె చేయొచ్చని వినిపిస్తోంది. హరీష్ శంకర్‌తో ఆమె ‘రామయ్యా వస్తావయ్యా’, ‘గబ్బర్‌సింగ్’ సినిమాలు చేసింది. ఇప్పుడు హరీష్ మరోసారి ఆమెను సంప్రదిస్తున్నాడని తెలుస్తోంది. ఆ సినిమాలో ఆమెకు ఆఫర్ చేస్తోంది హీరోయిన్ రోల్ కాబట్టి గ్రీన్ సిగ్నల్ ఇచ్చే ఛాన్సులు ఉన్నాయంటున్నారు. ఒకవేళ ఈ సినిమా ఒప్పుకుంటే ఇటు పవన్ కల్యాణ్‌తో, అటు హరీష్ శంకర్‌తో శ్రుతికి ఇది మూడో సినిమా అవుతుంది. రి-ఎంట్రీలో మంచి సినిమాలు, పాత్రల కోసం చూస్తోన్న శ్రుతి ఈ సినిమా ఆఫర్‌ను పక్కన పెట్టదనే అభిప్రాయం ఫిల్మ్‌నగర్‌లో వ్యక్తమవుతోంది.