Advertisementt

నిహారిక పెళ్లిబాజాలు మోగబోతున్నాయ్..!

Fri 19th Jun 2020 08:11 AM
mega daughter,niharika,marry,chaitanya,nagababu,chiranjeevi,wedding bells  నిహారిక పెళ్లిబాజాలు మోగబోతున్నాయ్..!
Niharika Wedding With Chaitanya! నిహారిక పెళ్లిబాజాలు మోగబోతున్నాయ్..!
Advertisement
Ads by CJ

 

మెగా డాటర్ హీరోయిన్‌గా ఎదగాలని.. పేరు తెచ్చుకోవాలని కలలు కనింది. అందుకోసం ఎవరికి నచ్చినా నచ్చకపోయినా గ్లామర్ షో చెయ్యాలని నిర్ణయం తీసుకొవడం సోషల్ మీడియాలో హాట్ హాట్ యాంగిల్స్ తో ఫొటోస్ షూట్స్ చేయించుకుని మరీ రెచ్చిపోయింది. అంతేకాదు.. రొమాంటిక్, గ్లామర్ షో అన్నిటికి రెడీ అంటూ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. మధ్యలో నాగబాబు నిహారికకు వచ్చే ఏడాది పెళ్లి చేద్దామనుకుంటున్నాం అని చెప్పడంతో.. అయ్యో నాగబాబే నిహారిక కలలు తుడిచేస్తున్నాడని అన్నారు. కానీ తాజాగా నిహారిక కూడా పెళ్లికి రెడీ అయ్యింది.

పెళ్లి అయ్యే లోపు ఎన్ని సినిమాలైనా నటించాలని, పెళ్లి తర్వాత నటించడానికి నేనేమన్నా సమంతనా అని అడిగిన నిహారిక తాజాగా పెళ్లి పీటలెక్కడానికి రెడీగా ఉంది. తాజాగా సోషల్ మీడియాలో నిహారిక పెళ్లి గురించి చెప్పడానికి ఆడే దోబూచులాట చూస్తే నిహారిక పెళ్లి ఈ ఏడాదే ఖాయమనిపిస్తుంది. నిహారిక ఓ పోలీస్ అధికారి కొడుకుని వివాహమాడబోతున్నట్టుగా... అది కూడా రేపు నాగబాబు తన కూతురు నిహారిక పెళ్లి మేటర్ మీడియాకి తెలపబోతున్నట్లుగా న్యూస్ రావడం, నిహారిక ఓ అబ్బాయి పేస్ కనబడకుండా కవర్ చేస్తూ ఓ పిక్ పెట్టడం వంటివాటితో ఒక్కసారిగా నిహారిక పెళ్లి హాట్ టాపిక్ అయింది. వరుడు పేరు చైతన్య అని తెలుస్తుంది. ఇక నాగబాబు నిహారిక కు మంచి పెళ్లి కొడుకుని వెతకడమే కాదు.. అన్ని మాట్లాడుకుని పెళ్లిని ఓకే చేసుకున్నట్టుగా.. దీనినంతటిని చిరు స్వయంగా దగ్గరుండి చూసుకుంటున్నట్టుగా సోషల్ మీడియా టాక్.

Niharika Wedding With Chaitanya!:

Mega Daughter Niharika To Marry Chaitanya!

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ