Advertisementt

కియారా ప్లేస్ లో కీర్తి సురేష్..?

Thu 18th Jun 2020 04:07 PM
keerthy suresh,kiara advani,sarkaru vaari paata,parashuram   కియారా ప్లేస్ లో కీర్తి సురేష్..?
Keerthy accepted for it..? కియారా ప్లేస్ లో కీర్తి సురేష్..?
Advertisement
Ads by CJ

సూపర్ స్టార్ మహేష్ బాబు సర్కారు వారి పాట సినిమా ప్రకటన వచ్చినప్పటి నుండి ఎన్నో కథనాలు వెలువడుతున్నాయి. గీత గోవిందం సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్న పరశురామ్ ఈ సినిమాని డైరెక్ట్ చేస్తున్నాడు. ఇప్పటికే రిలీజైన ప్రీ లుక్ కి ప్రేక్షకుల నుండి మంచి స్పందన వచ్చింది. అంతే కాదు అభిమానుల్లో ఎంతో ఆసక్తిని కూడా కలిగించింది. అయితే ఈ సినిమాలో మహేష్ బాబు సరసన నటించే హీరోయిన్ గురించి సోషల్ మీడియాలో పెద్ద చర్చ నడుస్తుంది.

మొదట్లో కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తుందని వార్తలు వచ్చాయి. ఈ మేరకు చిత్రబృందం కియారాని సంప్రదించిందట. కానీ డేట్స్ కుదరకపోవడంతో సర్కారు వారి పాటలో మహేష్ సరసన నటించే అవకాశాన్ని వదులుకుందట. అయితే తాజగా కీర్తి సురేష్ సర్కారు వారి పాటలో హీరోయిన్ గా నటించడానికి ఒప్పుకుందని సమాచారం. 

ఇప్పటికైతే ఈ విషయమై అధికారిక ప్రకటన రాలేదు. కానీ కీర్తి సురేష్ హీరోయిన్ గా ఫిక్స్ అయినట్లే అని అంటున్నారు. మరి అధికారికంగా ఎప్పుడు ప్రకటిస్తారో చూడాలి. థమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాని మైత్రీ మూవీ మేకర్స్, 14రీల్స్ ప్లస్, జీ ఎమ్ బీ ఎంటర్ టైన్ మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.

Keerthy accepted for it..?:

Inplace of Kiara, keerthy accepted it

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ