కరోనా లాక్‌డౌన్‌తో సినిమా ఇండస్ట్రీలో చిన్న పెద్ద సినిమాలు, బుల్లితెర షూటింగ్స్ మొత్తం ఆగిపోయాయి. గత మూడు నెలలుగా స్తబ్దుగా ఉన్న సినిమా పరిశ్రమ కరోనా లాక్ డౌన్ ముగియడంతో ప్రభుత్వ అనుమతులతో షూటింగ్ చెయ్యాలని సినిమా పెద్దలు సమాయత్తమవుతున్నారు. అందులో భాగంగా కరోనా వలన తగిన జాగ్రత్తలు తీసుకుంటూ ట్రయిల్ షూట్ చేశాక మళ్లీ కొద్దిమంది సిబ్బందితో షూటింగ్ చేసుకోమని ప్రభుత్వం చెప్పడంతో రాజమౌళి RRR ట్రయిల్ షూట్ కోసం రెడీ అయ్యాడు. అందుకోసం RRR టీం తో మీటింగ్ కూడా పెట్టాడు. ఇక రెండు మూడురోజుల్లోనే RRR ట్రయిల్ షూట్ తో సెట్స్ మీదకెళ్ళబోతున్న తరుణంలో RRR ట్రయిల్ షూట్ కూడా వాయిదా పడినట్లుగా తెలుస్తుంది.
హైదరాబాద్‌లో కరోనా ఉదృతి రోజురోజుకి తీవ్ర రూపం దాల్చడంతో రాజమౌళి అండ్ టీం ట్రయిల్ షూట్ జరపడం కూడా కుదరదని నిర్ణయానికి వచ్చినట్లుగా టాక్. కరోనా ఉదృతి కాస్త తగ్గుముఖం పట్టేవరకు RRR షూట్ చెయ్యడం మాత్రం కాదు.. అసలు ఏ సినిమాల షూటింగ్ చెయ్యడం కరెక్ట్ కాదనే భావనలో దర్శకుడు తేజ ఉన్నాడు. అయితే ఇప్పుడు RRR ట్రయిల్ షూట్ జరగకపోతే మిగతా సినిమాల కూడా షూటింగ్ చెయ్యడం కుదరదేమో అంటున్నారు. మరి కరోనా ఉదృతి తగ్గి మళ్లీ ఎప్పుడు సెట్స్ మీదకెళ్తారో చూడాలి.