Advertisementt

కీర్తిసురేష్‌పై పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు!

Thu 18th Jun 2020 03:44 PM
keerthi suresh,corona effect,remuneration,decreased,penguin,sarkaru vaari paata  కీర్తిసురేష్‌పై పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు!
Praises on Heroine Keerthi Suresh కీర్తిసురేష్‌పై పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు!
Advertisement
Ads by CJ

కీర్తి సురేష్ నటించిన పెంగ్విన్ సినిమా రేపు అమెజాన్ ప్రైమ్‌లో డైరెక్ట్‌గా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. థియేటర్స్ ఓపెన్ చేయని కారణంగా కీర్తి సురేష్ తన నిర్మాతలు నష్టపోకూడదనుకుని... తాను నటించిన సినిమాకి ఎటువంటి అబ్జెక్షన్స్ పెట్టకుండా ఓటిటి లో విడుదల చేసుకునేందుకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడమే కాదు.. తనవంతు ప్రమోషన్స్ కూడా చేసింది. అయితే తాజాగా కీర్తి సురేష్ ని చూసి టాప్ హీరోయిన్స్ నేర్చుకోవాలంటున్నారు. ఎందుకంటే కరోనా లాక్ డౌన్ తో సినిమా పరిశ్రమ మొత్తం కుదేలైంది. ప్రస్తుతం నిర్మాతలు గట్టెక్కాలంటే సినిమా బడ్జెట్ లో కోత, నటుల పారితోషకాల కుదింపు, దర్శకుల రెమ్యునరేషన్స్ కటింగ్స్ అంటూ పెద్ద లిస్ట్ బయటికి వచ్చింది. ఇప్పటికే మహేష్ సినిమా సర్కారు వారి పాట కోసం దర్శకుడు పరశురామ్ పారితోషకం తగ్గించుకున్నాడనే న్యూస్ ఉంది.

తాజాగా కీర్తి సురేష్ కూడా తన పారోతోషకాన్ని తగ్గించుకుని నిర్మాతలకు బాసటగా నిలబోతుందట. ముందుగా మాట్లాడుకున్న పారితోషకం లో నుండి ఓ 20 నుండి 30 శాతం పారితోషకాన్ని తగ్గించుకునేందుకు కీర్తి సురేష్ రెడీ అయ్యిందట. ఇప్పటికే ఒప్పుకున్న సినిమాల విషయంలోనూ, ఇక ముందు ఒప్పుకోబోయే సినిమాల విషయంలోనూ కీర్తి సురేష్ ఇలా పారితోషకం తగ్గించుకోవడానికి రెడీగా ఉన్నట్లుగా చెబుతుందట. మరి కీర్తి సురేష్ ఇప్పుడు పరశురామ్ - మహేష్ సర్కారు వారి పాట సినిమాలో హీరోయిన్ గా ఫైనల్ అయ్యే అవకాశాలు ఉన్నాయని.. ఇందుకోసమే కీర్తి సురేష్ తన పారితోషకం తగ్గించుకోబోతున్నట్టుగా టాక్.

Praises on Heroine Keerthi Suresh:

corona Effect: Keerthi Suresh remuneration decreased 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ