Advertisementt

‘సర్కారు వారి పాట’ విలన్‌గా ఆ హీరో!

Thu 18th Jun 2020 05:17 AM
mahesh babu,kannada star hero,sarkaru vaari paata,super star,parasuram,upendra  ‘సర్కారు వారి పాట’ విలన్‌గా ఆ హీరో!
Mahesh Babu wants Kannada Star Hero for Sarkaru Vaari Paata ‘సర్కారు వారి పాట’ విలన్‌గా ఆ హీరో!
Advertisement
Ads by CJ

ఇప్పుడు మహేష్ ‘సర్కారు వారి పాట’ సినిమా కోసం హీరోయిన్, విలన్ విషయంలో రోజుకో న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. మహేష్ బాబు.. కాస్త ఆగండీ కరోనా తగ్గనివ్వండి... సినిమా షూటింగ్ మొదలెడదాం అని పరశురామ్ అండ్ టీం కి చెప్పడంతో పరశురామ్ ఈలోపు హీరోయిన్, విలన్ అంటూ నటుల ఎంపికతో పాటుగా ప్రీ ప్రొడక్షన్ పనులతో బిజీగా ఉన్నాడు. అయితే ఈ సినిమాలో మహేష్ కి జోడిగా కీర్తి సురేష్ పేరుతో పాటుగా... బాలీవుడ్ లేలేత అందాల సాయి మంజ్రేకర్ పేరు వినబడుతుంది. ఇక సర్కారు వారి పాటలో మహేష్ ని ఎదుర్కునే విలన్ విషయంలో కూడా అందరిలో ఆసక్తి పెరుగుతుండగా.. మొన్న ‘ఈగ’ ఫేమ్ సుదీప్ మహేష్ సినిమాలో విలన్ గా పరశురామ్ సంప్రదించాడని అన్నారు.

తాజాగా ‘ఈగ’ ఫేమ్ సుదీప్ కన్నా సన్ ఆఫ్ సత్యమూర్తితో నెగెటివ్ షేడ్స్ లో అదరగొట్టిన ఉపేంద్ర అయితే బావుంటుంది అని మహేష్ బాబు.. దర్శకుడు పరశురామ్ కి సలహా ఇచ్చినట్లుగా ఫిలింనగర్ టాక్. సర్కారు వారి పాటలో హీరోకి సమానమైన విలన్ పాత్ర కోసం ఖచ్చితంగా హీరోలనే తీసుకోవాలని అందులో సుదీప్ కన్నా ఉపేంద్ర అయితేనే బావుంటుంది అని మహేష్ చెబుతున్నాడట. మరి పరశురామ్ ఇప్పుడు ఉపేంద్ర ని సంప్రదించే ఏర్పాట్లలో ఉన్నాడట. ఇక ఈ సినిమా సెప్టెంబర్ నుండి కాకుండా డిసెంబర్ నుండి సెట్స్ మీదకెళ్లేలా ఉంది అని అంటున్నారు.

Mahesh Babu wants Kannada Star Hero for Sarkaru Vaari Paata:

>Mahesh Targets Kannada Market

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ