మహానటి సినిమా తర్వాత కీర్తి సురేష్ సినిమాలు రెండు విడుదలైనా అవి అట్టర్ ప్లాప్ అయ్యాయి. అయితే మహానటి తరవాత కీర్తి సురేష్ నుండి వస్తున్న థ్రిల్లర్ మూవీ, లేడి ఓరియెంటెడ్ మూవీ పెంగ్విన్ సినిమా ఇప్పుడు కరోనా కారణంగా థియేటర్స్ లో దిగకుండా నేరుగా ఓటిటి డిజిటల్ ప్లాట్ ఫామ్ లో విడుదలవుతుంది. అయితే థియేటర్స్ లోనే విడుదలవుతుంది అని అనుకున్నా... ఈ సినిమా థియేటర్స్ లో చూస్తే ఆ ఫీల్ వేరు. కానీ కరోనా నా ఆశల మీద నీళ్లు చల్లింది. అయినా నిర్మాతల మేలు అలోచించే ఈ ఓటిటి నిర్ణయమని చెబుతుంది కీర్తి సురేష్. ఇక మహానటి తర్వాత నావి కొన్ని సినిమాలు విడుదలైనా అవి మహానటి ముందు ఒప్పుకున్న సినిమాలు. ఈ సినిమా మహానటి తర్వాత ఒప్పుకున్న మొదటి సినిమా. ఈ సినిమా కథ నాకు బాగా నచ్చింది. మహానటి తర్వాత ఆరు నెలల విరామంతో ఈ కథ ఒప్పుకున్నాను. తల్లి బిడ్డల నేపథ్యంలో ఆసక్తికరంగా సాగే సినిమా పెంగ్విన్ అని చెబుతుంది కీర్తి సురేష్.
అయితే ఈ సినిమాలో తల్లి పాత్రలో నటించడానికి తన తల్లి దగ్గర ట్రైనింగ్ తీసుకుందట కీర్తి సురేష్, అంటే ప్రెగ్నెంట్ తో ఉన్నప్పుడు ఎలా ఉండాలి, ఎలా నడవాలి, ఎలాంటి జాగ్రత్తలు తీస్కోవాలి అనే విషయాలని షూటింగ్ స్పాట్ నుండి ఎప్పటికప్పుడు తన తల్లికి ఫోన్ చేసి కనుక్కునేదట కీర్తి సురేష్. నేను తల్లిని కాకపోవచ్చు. కానీ నేను ఓ తల్లికి బిడ్డనే కదా అంటుంది కీర్తి సురేష్. ఇక పెళ్లి కాకుండా తల్లి పాత్రలు.. అందులోను హీరోయిన్ గా క్రేజ్ ఉన్న టైంలో ఇలాంటి పాత్ర ఎలా చేసారు అని అడిగితే కథా బలమున్నప్పుడు తల్లి పాత్ర అయితే ఏమిటి అంటుంది కీర్తి సురేష్.