కొందరి హీరోయిన్ల అదృష్టం ఏంటో గానీ ఇలా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టగానే టకటకా అవకాశాలు వస్తూనే ఉంటాయి. చూస్తూ అన్నంతలో వారెక్కడికో ఎదిగిపోతారు. అలాగే మరికొందరు హీరోయిన్ల పరిస్థితి విచిత్రంగా ఉంటుంది. ఎన్నో ఏళ్ళుగా ఎన్నో సినిమాల్లో నటిస్తున్నా కూడా ఒక్క బ్రేక్ ఇచ్చే సినిమా కూడా రాదు. అలాంటి వారిలో ప్రముఖంగా వినిపించే పేరు తేజస్విని. హీరోయిన్ల సరసన చిన్న చిన్న పాత్రల్లో మెరిసిన తేజస్విని కొన్ని సినిమాలో కథానాయికగా కూడా చేసింది.
కానీ అవేమీ ఆమెకి హిట్ ఇవ్వలేకపోయాయి. ఇప్పటికీ ఆమె ఇంకా స్ట్రగులింగ్ ఫేజ్ లోనే ఉందని చెప్పుకుంటారు. అయితే ఈ మధ్య సోషల్ మీడియాలో ఆమె పెడుతున్న ఫోటోస్ చూస్తుంటే చాలా గట్టి ప్రయత్నమే చేస్తున్నట్టు కనిపిస్తోంది. తన ఫాలోవర్స్ ని అట్రాక్ట్ చేయడానికో, గ్లామర్ ని ఒలకబోయడంలో తనకేమీ అభ్యంతరం లేదన్న హింట్ ఇవ్వడానికో, లేక మరే కారణంగానో తెలియదు గానీ హాట్ హాట్ ఫోటోషూట్లతో రఫ్ఫాడించేస్తుంది.
అందాలని చూపించడంలో ఏమాత్రం మొహమాటపడట్లేదు. తాజాగా ఆమె షేర్ చేసిన ఫోటోలో మత్తెక్కించే చూపులతో అందాలని ఆరబోస్తూ చాలా హాట్ గా కనిపించింది. దాంతో ఆమెకి సోషల్ మీడియా ఫాలోవర్లు మరింతగా పెరుగుతున్నారు.