కరోనా కారణంగా సినిమా ఇండస్ట్రీ తీవ్ర ఇబ్బందులని ఎదుర్కుంటోంది. ఇప్పటికే రెండు నెలలకి పైగా షూటింగ్ నిలిపివేయడంతో ఆర్థికంగా బాగా నష్టం వాటిల్లింది. ఇక థియేటర్లు మూతబడడంతో రావాల్సిన రెవెన్యూ ఆగిపోయింది. అయితే ఈ నేపథ్యంలో సినిమా ఇండస్ట్రీలో చాలా మార్పులు రానున్నాయి. ఆ మార్పులకి అనుగుణంగా సినిమా నిర్మాతలు కూడా ఛేంజ్ అవుతున్నారు.
విజయ్ దేవరకొండ హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ఫైటర్ అనే సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఇస్మార్ట్ శంకర్ విజయంతో ఫామ్ లోకి వచ్చిన పూరి, ఈ సారి విజయ్ దేవరకొండతో ఫైట్ చేయించబోతున్నాడు. బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కే ఈ సినిమా పూర్తిగా ముంబయిలో షూటింజ్ జరుపుకోవాల్సింది. కానీ కరోనా వైరస్ విజృంభిస్తుండడంతో హైదారాబద్ లోనే షూటింగ్ కంప్లీట్ చేయనున్నారట.
ఇకపోతే లాక్డౌన్ టైమ్ లో ఈ సినిమా కథలో చాలా మార్పులు జరిగాయట. కథా ప్రకారం విజయ్ దేవరకొండ ఈ సినిమాలో విదేశీ ఫైటర్లతో తలపడాల్సి ఉందట. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో విదేశాల నుండి నటీనటులని తీసుకురావడం సాధ్యమయ్యే పనికాదని లోకల్ ఫైటర్స్ చేత ఆ సీన్స్ ని పూర్తి చేసే విధంగా కథలో మార్పులు చేసాడట. అనన్య పాండే హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకి మణిశర్మ సంగీతం అందిస్తున్నారు.