Advertisementt

బ‌న్నీ వాక్స్ బర్త్‌డే స్పెషల్: కొత్త చిత్ర వివరాలివే

Wed 17th Jun 2020 07:05 AM
bunny vox,chetan cheenu,mahas creations,production no 1,new movie,birthday special  బ‌న్నీ వాక్స్ బర్త్‌డే స్పెషల్: కొత్త చిత్ర వివరాలివే
Bunny Vox Birthday Special: New Movie Details Released బ‌న్నీ వాక్స్ బర్త్‌డే స్పెషల్: కొత్త చిత్ర వివరాలివే
Advertisement
Ads by CJ

ఒక అనాథ ల‌వ్ స్టోరీతో చేత‌న్ శీను, బ‌న్నీ వాక్స్ జంట‌గా తెర‌కెక్కుతున్న మ‌హాస్ క్రియేష‌న్స్ చిత్రం

చేత‌న్ శీను హీరోగా మ‌హాస్ క్రియేష‌న్స్ ప‌తాకంపై ప్రొడ‌క్ష‌న్ నెంబ‌ర్ 1గా ఒక సినిమా రూపొందుతోంది. మ‌ధువ‌ర్మ ద‌ర్శ‌క‌త్వంలో ఆళ్ల వెంక‌ట్ (ఏవీ) ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ద్వారా వ‌ర్షిణి బ‌న్నీ వాక్స్ హీరోయిన్‌గా ప‌రిచ‌య‌మ‌వుతోంది. ఆమె పుట్టిన‌రోజు సంద‌ర్భంగా సినిమాలో ఆమె పోషిస్తోన్న మ‌హా (మ‌హాల‌క్ష్మి) క్యారెక్ట‌ర్ ఫ‌స్ట్ లుక్‌ను చిత్రం బృందం విడుద‌ల చేసింది. లంగా వోణీ ధ‌రించి ఒక చేతిలో పుస్త‌కం, భుజాన బ్యాగ్‌తో కాలేజీ స్టూడెంట్ లుక్‌లో ఆమె ఆక‌ట్టుకుంటోంది.

త‌న ప్రేమ కోసం ఒంట‌రిగా పోరాడ‌ట‌మే కాకుండా.. మూఢ న‌మ్మ‌కాలు, ఆచారాలు, సంప్ర‌దాయాల‌కు వ్య‌తిరేకంగా కూడా పోరాడే ఒక అనాథ ప్రేమ‌క‌థ ఈ చిత్రం. బాప‌ట్ల‌లో అగ్రిక‌ల్చ‌ర‌ల్ డిగ్రీ చ‌దువుతుండే అత‌నికి అక్క‌డే ఒక అమ్మాయి ప‌రిచ‌య‌మై, అది ప్రేమ‌గా మారుతుంది. ఆ త‌ర్వాత అత‌ను ఎలాంటి ప‌రిణామాలు, ప‌రిస్థితులు ఎదుర్కొన్నాడ‌నేదే ఈ చిత్రంలోని ప్ర‌ధానాంశం. ఆద్యంతం ఆస‌క్తిక‌ర క‌థ‌నంతో ఈ చిత్రాన్ని ద‌ర్శ‌కుడు తీర్చిదిద్దుతున్నాడ‌నీ, చ‌క్క‌ని నిర్మాణ విలువ‌ల‌తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నార‌నీ చిత్ర బృందం తెలిపింది.

ఇప్ప‌టికే ఈ చిత్రానికి సంబంధించి రెండు షెడ్యూళ్లు పూర్త‌య్యాయి. ఒక షెడ్యూల్‌ను గుంటూరు ప‌రిస‌రాల్లో, మ‌రో షెడ్యూల్‌ను రాజ‌మండ్రి, వైజాగ్‌, అర‌కు ప్రాంతాల్లో జ‌రిపారు. మూడో షెడ్యూల్‌ను తెలుగు రాష్ట్రాల బ‌య‌ట నిర్వ‌హించ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నారు. అన్ని అనుమ‌తులూ ల‌భించ‌గానే షెడ్యూల్‌ను మొద‌లు పెట్టేందుకు చిత్ర బృందం రెడీ అవుతోంది.

తారాగ‌ణం:

చేత‌న్ శీను, వ‌ర్షిణి బ‌న్నీ వాక్స్‌, మ‌ణిచంద‌న‌, ర‌ఘుబాబు, జీవా, టీఎన్ఆర్‌, న‌వీన్ నేని, య‌డం రాజు, నాగ‌మ‌హేష్‌, ప‌వ‌న్ సురేష్‌

సాంకేతిక వ‌ర్గం:

మ్యూజిక్‌: బ‌ల్గ‌నిన్‌

సినిమాటోగ్రాఫ‌ర్‌: క‌న్న‌య్య సిహెచ్‌.

ఎడిట‌ర్‌: బి. నాగేశ్వ‌ర‌రెడ్డి

స్టంట్స్‌:  రామ‌కృష్ణ‌

కొరియోగ్ర‌ఫీ: అనీష్‌

లైన్ ప్రొడ్యూస‌ర్‌: వ‌ంశీ తాడికొండ‌

స‌హ నిర్మాత‌: రామ‌కృష్ణ రేజేటి (ఆర్ఆర్‌కె)

నిర్మాత‌: ఆళ్ల వెంక‌ట్ (ఏవీ)

డైరెక్ట‌ర్‌: మ‌ధువ‌ర్మ‌

బ్యాన‌ర్‌: మ‌హాస్ క్రియేష‌న్స్‌

Bunny Vox Birthday Special: New Movie Details Released:

Mahas Creations Production no 1 Film Details

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ