రెండు మూడు మీడియం రేంజ్ సినిమాలు చేసిన పరశురామ్‌కి గీత గోవిందం బ్లాక్ బస్టర్ అవడంతో మహేష్‌తో ఆఫర్ పట్టేలా చేసింది. మహేష్‌తో ఆఫర్ అంటే పరశురామ్ రేంజ్ ఒక్కసారిగా పెరిగిపోయింది. గీత గోవిందం తర్వాత మహేష్‌తో చేయాలనే కసితో పరశురామ్ రెండున్నరేళ్లుగా ఖాళీగానే ఉన్నాడు. చివరికి మహేష్ హోల్డ్ లో పెట్టడంతో చైతుని లైన్‌లోకి తెచ్చుకున్నాడు. మళ్లీ మహేష్ పిలవడంతో.. పరశురామ్ మహేష్ కోసం సర్కారు వారి పాట కథ రెడీ చేసి సినిమాని ఎలాగోలా సెట్స్ మీదకి తీసుకెళ్లే ఏర్పాట్లు చేసాడు. కానీ కరోనాతో అది ఆరునెలల టైం పెట్టేలా ఉంది.
ఇక మహేష్‌తో పరశురామ్ సినిమా అన్నాక పరశురామ్ రేంజ్ పెరిగి పది కోట్లకి పారితోషకం మాట్లాడుకున్నాడు నిర్మాతలతో. అయితే మహేష్ సర్కారు వారి పాటకు ముందు పరశురామ్ రేంజ్ 4 నుండి 6 కోట్లు. కానీ మహేష్ తో సినిమా అనగానే పరశురామ్ రేంజ్ పది కోట్లకి పెరిగిపోయింది. పరశురామ్ నిర్మాతలతో అగ్రిమెంట్ కూడా చేసుకున్నాడన్నారు. తాజాగా పరశురామ్ తన పారితోషకాన్ని తగ్గించుకున్నాడనే టాక్ నడుస్తుంది. కారణం కరోనా తో నిర్మాతలంతా ఇప్పుడు దిక్కుతోచని పరిస్థితుల్లోకి వెళ్లారు. సినిమా ఇండస్ట్రీ మొత్తం అతలాకులతలం అయ్యింది. ఈ లాక్ డౌన్ కష్టాలను తట్టుకుని షూటింగ్ చేయాలంటే హీరోలు, హీరోయిన్స్, దర్శకులు అందరూ పారితోషకాలు తగ్గించుకోవాలని ప్రతిపాదన వచ్చేసింది. దానితో సినిమా బడ్జెట్ తగ్గుతుంది. అందుకే నిర్మాతలకు ఇబ్బంది లేకుండా పరశురామ్ ముందే పారితోషకాన్ని పది నుండి ఏడు కోట్లకి తగ్గించుకున్నాడని సమాచారం. మరి పరశురామ్ ఇలా చేసి అందరికి ఆదర్శంగా నిలిచినట్టే.