సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక ఏ విషయమైనా నిమిషాల్లో అందరికి చేరిపోతుంది. మీడియాలో రాకముందే సోషల్ మీడియాలో న్యూస్ లు కుప్పలు తెప్పలుగా ప్రజల్లోకి వెళ్లిపోతున్నాయి. మంచి విషయాలు, చెడు విషయాలు ఏవైనా క్షణాల్లో వైరల్ అవుతున్నాయి. అందులో వినకూడనవి కూడా ఉంటున్నాయి. తాజాగా బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజపుత్ ఆత్మహత్య అందరి మనసులను కలిచివేసింది. దేశ ప్రధాని మోడీ దగ్గర నుండి బాలీవుడ్, కోలీవుడ్, శాండిల్ వుడ్, మల్లువుడ్, టాలీవుడ్ ప్రముఖులు, ఆయన అభిమానులు అందరూ సుశాంత్ ఆత్మహత్యకు ఎమోషనల్ పోస్ట్ లు పెట్టారు. అయితే ఇలాంటి విషయాలను వినాల్సి వస్తుంది అని ఓ టాప్ హీరోయిన్ సోషల్ మీడియాకి కొన్నాళ్ళు దూరంగా ఉందామనుకుంటుందట. చిరు ఆచార్య నుండి అర్ధాంతరంగా తప్పుకుని న్యూస్ గా మారిన త్రిష ఇప్పుడు సోషల్ మీడియా నుండి తప్పుకుంటుందట.
ఇప్పుడు తానున్న పరిస్థితుల్లో సోషల్ మీడియా నుండి తప్పుకోవడం చాలా అవసరమని చెబుతుంది. నేను చాలా హ్యాపీగా ఉన్నాను అంటూనే.. ప్రస్తుతం నా చుట్టుపక్కల ఏం జరుగుతుందో అనేది నాకు తెలియకపోవడమే మంచిది. అది అవసరం కూడా. మైండ్ కి ఇది డిజిటల్ చికిత్స లాంటిది. కరోనాతో బయట తిరగకండి.. ఇంట్లోనే ఉండండి.. సేఫ్ గా ఉండండి లవ్ యు గైస్ అంటూ సోషల్ మీడియాకి దూరమవుతున్నట్టుగా త్రిష ట్వీట్ చేసింది. మరి త్రిషకి బయట జరుగుతున్న పరిణామాలు చూసి ఎంత వేదన అనుభవిస్తేనే కానీ ఇలా సోషల్ మీడియాకి దూరమైందో అంటూ ఆమె అభిమానులు ఫీలవుతున్నారు.