Advertisementt

సర్కారు వారి పాట ఆమెకే దక్కేలా ఉంది..?

Mon 15th Jun 2020 03:05 PM
sarkaru vaari paata,mahesh babu,parashuram,saiee manjrekar,kiara advani  సర్కారు వారి పాట ఆమెకే దక్కేలా ఉంది..?
Sarakaru vaari Paata will go to her hand..? సర్కారు వారి పాట ఆమెకే దక్కేలా ఉంది..?
Advertisement
Ads by CJ

సరిలేరు నీకెవ్వరు సినిమా తర్వాత సూపర్ స్టార్ మహేష్ ఎవరి దర్శకత్వంలో నటిస్తాడనే  విషయమై ఎన్నో తర్జన భర్జనలు నడిచిన తర్వాత పరశురామ్ దర్శకత్వంలో సర్కారు వారి పాట సినిమా అనౌన్స్ మెంట్ బయటకి వచ్చింది. గత కొన్ని రోజులుగా మీడియం రేంజ్ దర్శకులతోనే ప్రాజెక్టులని ఓకే చేస్తున్న మహేష్, ఈ సారి కూడా అలాంటి నిర్ణయమే తీసుకుని పరశురామ్ కి అవకాశం ఇచ్చాడు.

ఇప్పటికే రిలీజైన ఫస్ట్ లుక్ టైటిల్ పోస్టర్ కి విశేష స్పందన లభించింది. టైటిల్ చూస్తుంటే మాస్ ప్రేక్షకులకి కావాల్సిన అన్ని అంశాలు ఉన్నాయని తెలుస్తుంది. ఈ విషయమై పరశురామ్ మహేష్ అభిమానులకి మాటిచ్చాడు కూడా. అయితే ఈ సినిమాలో హీరోయిన్ గా ఎవరు నటిస్తున్నారనేది క్లారిటీ రాలేదు. మొదట్లో కీర్తి సురేష్ పేరు వినిపించినా ఆ తర్వాత కియారా అద్వానీ, సాయి మంజ్రేకర్ ల పేర్లు ఎక్కువగా వినబడుతున్నాయి.

ఈ ఇద్దరు బాలీవుడ్ భామల్లో ఎవరో ఒకరికి హీరోయిన్ గా అవకాశం దక్కేలా ఉందని అంచనా వేస్తున్నారు. అయితే దబాంగ్ 3 ఫేమ్ సాయి మంజ్రేకర్ ని ఈ విషయమై అడగ్గా, ఇందులో వాస్తవం లేదని చెప్పినట్టు తెలుస్తుంది. అయితే ఆ తర్వాతే పెద్ద షాకింగ్ న్యూస్ బయటకి చెప్పింది. మహేష్ భార్య నమ్రత సాయి మంజ్రేకర్ తల్లిదండ్రులకి బాగా తెలుసట. వారు రెగ్యులర్ గా టచ్ లో ఉంటున్నారని చెప్పింది.

అంటే సాయి మంజ్రేకర్ సర్కారు వారి పాటలో ఫిక్స్ అయినట్టే అని అంటున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి.

Sarakaru vaari Paata will go to her hand..?:

Sarakaru vaari Paata will go to her hand..?

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ