సీనియర్ హీరో, డైలాగ్ కింగ్ మోహన్ బాబు సూపర్ హిట్ చిత్రం పెదరాయుడు సినిమా రిలీజై నేటితో 25ఏళ్ళు పూర్తవుతోంది. ఈ నేపథ్యంలో ఆ సినిమా ముచ్చట్లు సోషల్ మీడియా వేదికగా మార్మోగుతున్నాయి. అయితే గత కొన్ని రోజులుగా మోహన్ బాబు తెలుగు సినిమాల్లో కనిపించట్లేదు. గాయత్రి సినిమా ఫ్లాప్ తర్వాత ఆయన తెలుగులో మళ్లీ కనిపించలేదు. ప్రస్తుతం తమిళ నటుడు సూర్య హీరోగా సుధ కొంగర దర్శకత్వంలో తెరకెక్కిన ఆకాశం నీ హద్దురా సినిమాలో ఒకానొక కీలక పాత్రలో నటించాడు.
ఈ పాటికే రిలీజ్ కావాల్సిన ఈ చిత్రం లాక్డౌన్ వల్ల వాయిదా పడింది. థియేటర్లకి అనుమతి లభించాక ఈ సినిమా ప్రేక్షకుల ముందుకి రానుంది. అయితే ఇదే గాక మణిరత్నం దర్శకత్వంలో భారీ స్థాయిలో తెరకెక్కుతున్న పాన్ ఇండియా మూవీ పొన్నియన్ సెల్వమ్ లోనూ మోహన్ బాబు నటించనున్నాడు. అయితే డైరెక్ట్ తెలుగులోనూ ఎప్పుడు కనిపిస్తారని అడగ్గా, తమ ఫ్యామిలీ బ్యానర్ లో తెరకెక్కే భారీ కుటుంబ కథా చిత్రంలో కనిపిస్తాడట. ఈ సినిమా మరో పెదరాయుడు లాగా ఉంటుందట.
ఇప్పటికే కథా చర్చలు పూర్తయ్యాయని సమాచారం. మరి దర్శకుడు ఎవరన్నది మాత్రం చెప్పలేదు. మొత్తానికి మరోసారి పెదరాయుడు లాంటి సినిమాతో మనల్ని పలకరించనున్నాడన్న మాట. మరి పెదరాయుడు సినిమాలాగే ఆ కుటుంబ కథా చిత్రం కూడా ప్రేక్షకుల మెప్పు పొందుతుందేమో చూడాలి.