ఆదివారం సాయంత్రం మూడు గంటల సమయంలో ఛానల్స్‌లో, సోషల్ మీడియాలో బ్రేకింగ్ న్యూస్, సుశాంత్ సింగ్ రాజపుత్ ఆత్మహత్య. తన ఇంట్లోనే తన బెడ్ రూమ్ లోనే ఫ్యాన్ కి ఉరివేసుకుని సుశాంత్ సింగ్ ఆత్మహత్య చేసుకున్నాడు. ఇది తెలిసిన అన్ని రకాల భాషల ప్రముఖులు, రాజకీయనాయకులు, పీఎం మోడీ.. సుశాంత్ మృతికి సోషల్ మీడియాలో సంతాపం తెలిపారు. అసలు సుశాంత్ సింగ్ ఎందుకు ఆత్మహత్య చేసుకున్నాడు. అంత బాధ ఏమొచ్చింది అంటే.. అతను మానసిక వ్యాధితో బాధపడుతున్నాడు. ఆ కారణముగా సుశాంత్ ఆరు నెలలుగా ట్రీట్మెంట్ లో ఉన్నాడు. అతని ఆత్మ హత్యకు మానసిక సంఘర్షణే కారణమని పోలీస్ వారు ప్రాధమిక విచారణలో తేల్చారు. కాదు సుశాంత్ ది హత్య.. అతనికి ఆత్మహత్య చేసుకోవాల్సిన అగత్యం లేదంటూ సుశాంత్ ఫ్యామిలీ డిమాండ్ చేస్తుంది.
సుశాంత్ సింగ్ రాజపుత్ ఆత్మహత్యకు రకరకాల కారణాలు అంటూ సోషల్ మీడియాలో న్యూస్. తాజాగా సుశాంత్ కి మానసిక వ్యాధి మాత్రమే కాదు.. ఫైనాన్స్ ప్రోబ్లెంస్ కూడా ఉన్నాయి. అందుకే అతను చనిపోయంటున్నారు. కానీ సుశాంత్ సింగ్ రాజపుత్ సక్సెస్ ట్రాక్ చూస్తే అలా అనిపించదు. బోలెడంత ఫేమ్, క్రేజ్, అవకాశాలు ఉన్నప్పుడు ఆత్మహత్య చేసుకోవాల్సిన అవసరం లేదు. సుశాంత్ విలాసవంతమైన ల్యాండ్ రోవర్ కారు మరియు బిఎమ్‌డబ్ల్యూ బైక్‌లను కలిగి ఉండడమే కాదు.. ముంబై లోని బాంద్రా లో ఖరీదైన ప్లాట్‌కి నెలకి నాలుగున్నర లక్షణాలు అద్దె కడుతున్న సుశాంత్ కి ఆర్ధిక సమస్యలా..? అనే అనుమానాలు కూడా కలుగుతున్నాయి.
అలాగే సుశాంత్ సింగ్ స్వచ్ఛంద సంస్థలకు ఉదారంగా, కేరళ వరద సహాయ పనుల కోసం కేరళ సిఎం రిలీఫ్ ఫండ్‌కు కోటి విరాళంగా ఇచ్చాడు. ఇలా ఉదారంగా దానాలు చేసే సుశాంత్ కి ఆర్ధిక సమస్యలంటే నమ్మాలనిపించడం లేదు. కాకపోతే ఈ స్టార్ స్టేటస్ ని మెయింటింగ్ చేయగలమా అనే మానసిక ఒత్తిడి ఇలాంటి ఆత్మహత్యలకు ఉసిగొలుపుతుంది. మహామహులకే ఈ మానసిక ఒత్తిడిని దిగమించడం సాధ్యం కాలేదు.