తెలుగు సినిమాల మార్కెట్ చాలా పెరిగింది. తెలుగులో రిలీజ్ అయిన సినిమాలకి ప్రతీ చోటా మంచి గిరాకీ ఏర్పడింది. ఇక్కడ రిలీజ్ అయిన చిత్రాలని హిందీలో డబ్ చేసి వదిలితే మిలియన్స్ లో వ్యూస్ వస్తున్నాయి. తెలుగులో హిట్ అయిన సినిమాలకి ఆ రేంజ్ లో వ్యూస్ వచ్చాయంటే అర్థం చేసుకోవచ్చు. కానీ తెలుగులో సరిగ్గా ఆడని చిత్రాలకి సైతం అదే స్థాయిలో వ్యూస్ రావడం ఒకింత ఆశ్చర్యం కలిగించే విషయం.
విజయ్ దేవరకొండ హీరోగా నటించిన డియర్ కామ్రేడ్ తెలుగులో యావరేజిగా కూడా నిలవలేకపోయింది. రష్మిక మందన్న హీరోయిన్ గా నటించిన ఈ చిత్రాన్ని భరత్ కమ్మ డైరెక్ట్ చేశాడు. అయితే తెలుగులో అంతగా ఆకర్షించలేకపోయిన ఈ చిత్రం హిందీ ప్రేక్షకులని విపరీతంగా ఆకర్షిస్తుంది. యూట్యూబ్ వేదికగా హిందీ వెర్షన్ లో విడుదల అయిన ఈ చిత్రం ఇప్పటి వరకు 130 మిలియన్ల వ్యూస్ దక్కించుకుంది.
అంతే కాదు 1.6 మిలియన్ల లైక్స్ దక్కించుకుని అత్యధిక లైక్స్ పొందిన హిందీ డబ్బింగ్ తెలుగు చిత్రంగా రికార్డు క్రియేట్ చేసింది. తెలుగు సినిమాల హిందీ వెర్షన్స్ అయిన సరైనోడు, హలో గురు ప్రేమ కోసమే, అ ఆ చిత్రాలని దాటివేసి ఈ రికార్డుని సొంతం చేసుకుంది. మొత్తానికి ఇక్కడ ఫ్లాప్ అయినా అక్కడ బాగానే ఆకట్టుకుంటుంది.