ఇప్పుడు కరోనా లాక్‌డౌన్ తో ఏ సినిమా చూసినా ఓటిటి లో విడుదలైపోతుందేమో అనే అనుమానం అందరిలో ఉంది. అలా ఉంది థియేటర్స్ విషయం. అయితే కన్నడలో సూపర్ హిట్ అయ్యి నాలుగు భాషల్లో దుమ్ము దులిపిన కెజిఎఫ్ కి సీక్వెల్ గా తెరకెక్కుతున్న కెజిఎఫ్ 2 సినిమా పై ఇప్పుడొక న్యూస్ సోషల్ మీడియాలో ప్రచారంలో ఉంది. కెజిఎఫ్ భారీ హిట్ అవడంతో.. దర్శకుడు ప్రశాంత్ నీల్ కెజిఎఫ్ 2 ని భారీ లెవల్లో పాన్ ఇండియా క్రేజ్ తో సినిమాని తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమా లాక్ డౌన్ లేకపోతే జులై 31 కి విడుదల కావాల్సి ఉంది. కానీ లాక్ డౌన్ తో కొంతమేర షూటింగ్ పెండింగ్ లో ఉండడంతో.. ఇప్పుడు మళ్ళీ షూటింగ్స్ కి అనుమతులు లభించడంతో.. మళ్లీ సెట్స్ మీదకెళ్లడానికి సిద్ధంగా ఉన్న కెజిఎఫ్ 2 సినిమా ఓటిటిలో విడుదల కాబోతుందంటూ ప్రచారం జరుగుతుంది.
అందుకోసం ఓటిటి వారు కెజిఎఫ్ సీక్వెల్ నిర్మాతలకు భారీ ఆఫర్ ఇచ్చి ఆ సినిమాని డైరెక్ట్ గా డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లో విడుదల చేయబోతున్నారనే న్యూస్ నడుస్తుంది. అయితే ఈ వార్త చూసిన యశ్ కి కాస్త గట్టిగానే కోపం వచ్చిందట. కెజిఎఫ్ 2 సినిమా ఓటిటిలో విడుదలయ్యే ప్రసక్తే లేదు. మా సినిమా ఎట్టి పరిస్థితుల్లో థియేటర్స్ లోనే విడుదలవుతుంది. కెజిఎఫ్ 2 ని దర్శకుడు అన్ని హంగులతో భారీగా తెరకెక్కిస్తున్నాడు. ప్రేక్షకుల అంచనాలను మా దర్శకుడు తప్పకుండా అందుకుంటాడు. మొదటి పార్ట్ కంటే రెండో పార్ట్ ఇంకా ప్రతిష్టాత్మకంగా ఉండబోతుంది అంటున్నాడు.