Advertisementt

అల్లు అరవింద్ ఆహాలో భానుమతీ రామక్రిష్ణ..!

Sun 14th Jun 2020 04:34 PM
naveen chandra,saloni luthra,bhanumathi ramakrishna,srikanth nagote,aha,allu aravind  అల్లు అరవింద్ ఆహాలో భానుమతీ రామక్రిష్ణ..!
Bhanumathi Ramakrishna is coming on Aha..? అల్లు అరవింద్ ఆహాలో భానుమతీ రామక్రిష్ణ..!
Advertisement
Ads by CJ

థియేటర్లు ఇప్పట్లో తెరుచుకునే పరిస్థితి లేకపోవడంతో నిర్మాతలందరూ తమ చిత్రాలని ఓటీటీ వేదికగా విడుదల చేయాలని భావిస్తున్నారు. లాక్డౌన్ టైమ్ లో ఓటీటీకి అలవాటు పడిన జనాలకి కొత్త కంటెంట్ ఇచ్చే ఉద్దేశ్యంతో ఓటిటీ యాజమాన్యాలు కూడా సినిమాలకి మంచి ధరలని ఇచ్చేందుకు సిద్ధం అవుతున్నాయి. ఈ నేపథ్యంలో అందాల రాక్షసి సినిమాలో హీరోగా నటించిన నవీన్ చంద్ర చిత్రం ఓటీటీలో రిలీజ్ కానుంది.

నార్త్ స్టార్ ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్ లో నవీన్ చంద్ర, సలోని లుత్రా హీరో హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రం అల్లు అరవింద్ ఆహా యాప్ ద్వారా డిజిటల్ స్ట్రీమింగ్ కి సిద్ధమైంది. ఇప్పటికే రిలీజ్ చేసిన ట్రైలర్ కి మంచి స్పందన లభించింది. పెళ్ళి కాని ముఫ్పై ఏళ్ళ సిటీ అమ్మాయి, కొత్తగా సిటీకి వచ్చిన గ్రామీణ ప్రాంతానికి చెందిన అబ్బాయి, కలిసి ఒకే ఆఫీసులో పనిచేస్తుంటారు. అప్పుడు వారిద్దరి మధ్య వచ్చే ఈగోలు, స్నేహాలు, అన్నీ కలిసి చివరికి ప్రేమగా ఎలా మారిందన్నదే కథ..

అయితే ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ కోసం ఆహా టీమ్ బాగానే చెల్లించిందని సమాచారం.ట్రైలర్ ద్వారా ఆసక్తి రేపిన నవీన్ చంద్ర, పూర్తి సినిమా ద్వారా ఆకట్టుకుంటాడో లేదో చూడాలి.ఈ సినిమాకి శ్రీకాంత నగోటి దర్శకత్వం వహించాడు.

Bhanumathi Ramakrishna is coming on Aha..?:

Bhanumathi Ramakrishna is coming on Aha..?

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ