బాలీవుడ్ హీరో సుశాంత్ర్ సింగ్ రాజ్ పుత్ మరణం పరిశ్రమని తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. యువనటుడు, ఎంతో భవిష్యత్తు ఉన్న హీరో, మరెన్నో పాత్రల్లో కనిపించి ప్రేక్షకులకి వినోదాన్ని పంచిపెట్టగల అవకాశం ఉండి కూడా ఇలా అకస్మాత్తుగా అందరినీ వదిలివెళ్ళిపోవడం అభిమానులకే కాదు, ప్రతీ ఒక్కరికీ షాకింగ్ గా ఉంది. ఎమ్ ఎస్ ధోనీ సినిమాలో అద్భుతమైన నటన ద్వారా ప్రేక్షకులకి మరింత చేరువైన సుశాంత్ ఇలా సడెన్ గా వెళ్ళిపోవడం శోచనీయం.
అయితే సుశాంత్ సింగ్ చివరి ఇన్స్టా పోస్ట్ చూస్తుంటే, మానసికంగా వేదన అనుభవించాడేమో అని అనిపించకమానదు. అతడి అమ్మ ఫోటో పక్కన తన ఫోటో పెడుతూ రాసిన రెండు మాటలు సుశాంత్ సింగ్ ఎన్నో రోజుల నుండి మానసికంగా బాధపడుతున్నాడని గుర్తుచేస్తున్నాయి. అతడు పోస్ట్ చేసిన దాంట్లో ఈ విధంగా ఉంది.. కన్నీటి బొట్టు నుండి అస్పష్టంగా గతం ఆవిరైపోతుంది. అంతం లేని కలలు మొహంపై చిరునవ్వుని చెక్కుతున్నాయి. ఇంకా.. అశాశ్వతమైన జీవితం.. ఈ రెండింటి మధ్య ఊగిసలాడుతుంది.. అమ్మా అంటూ పోస్ట్ పెట్టాడు. సుశాంత్ పదహారేళ్ళ వయస్సులో వాళ్ల అమ్మగారిని కోల్పోయాడు.