Advertisementt

మరో సినిమాకి అనుష్క గ్రీన్‌సిగ్నల్..!

Mon 15th Jun 2020 01:29 PM
anushka,uv creations banner,lady oriented movie,bhagamatie  మరో సినిమాకి అనుష్క గ్రీన్‌సిగ్నల్..!
Anushka Green Signal to One More lady oriented movie మరో సినిమాకి అనుష్క గ్రీన్‌సిగ్నల్..!
Advertisement
Ads by CJ

అనుష్క బాహుబలి తర్వాత విరామం మాములుగా లేదు. బరువు తగ్గే కార్యక్రమం అనుష్కని బాగా ఇబ్బంది పెట్టింది. రెండేళ్లుగా బయటికి కూడా రాకుండా అనుష్క ఒళ్ళు కరిగించింది. తర్వాతే నిశ్శబ్దం సినిమాతో మళ్ళీ ప్రేక్షకులను పలకరించడానికి రెడీ అయ్యింది. భాగమతి, నిశ్శబ్దం అన్ని లేడి ఓరియెంటెడ్ మూవీస్. భాగమతి తర్వాత నిశ్శబ్దం సినిమా చేసినా అనుష్క కరోనా లాక్ డౌన్ వలన సినిమా విడుదల ఆలస్యమవుతూ వచ్చింది లేదంటే అనుష్క నిశ్శబ్దం బాక్సాఫీసు దగ్గర సందడి చేసేది. అయితే ఇప్పుడు అనుష్క నిశ్శబ్దం తర్వాత మరో మూవీని ఓకే చేసినట్టుగా సోషల్ మీడియా టాక్.

స్టార్ హీరోలతో అవకాశాలు రాకో.. లేదంటే అనుష్కకే ఇష్టం లేదో తెలియదు కానీ.. అనుష్క మాత్రం ప్రస్తుతం లేడి ఓరియెంటెడ్ మూవీస్ మీదే ఫోకస్ పెట్టినట్లుగా అనిపిస్తుంది. అందుకే అనుష్క మరో హీరోయిన్ ఓరియెంటెడ్ మూవీకి జై కొట్టినట్లుగా తెలుస్తుంది. అది కూడా తనతో భాగమతి సినిమా చేసిన ప్రముఖ చిత్ర నిర్మాణ సంస్థ యూవీ క్రియేషన్స్ అనుష్క సినిమాని నిర్మించడానికి ప్లాన్ చేస్తోంది. రారా కృష్ణయ్య ఫేం పి.మహేశ్ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తాడని... ఇప్పటికే అనుష్క ఓకే చెప్పడంతో... ప్రీ ప్రొడక్షన్ కూడా మొదలైనట్టుగా టాక్. 

Anushka Green Signal to One More lady oriented movie:

Anushka again in UV Creations Banner

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ