Advertisementt

కోటి వ్యూస్‌తో ‘నో పెళ్లి...’ సాంగ్ సెన్సేష‌న్!

Mon 15th Jun 2020 05:49 AM
no pelli,song,sai tej,recored views,solo brathuke so better movie  కోటి వ్యూస్‌తో ‘నో పెళ్లి...’ సాంగ్ సెన్సేష‌న్!
Sai Tej Movie Song Creates Sensation in Social Media కోటి వ్యూస్‌తో ‘నో పెళ్లి...’ సాంగ్ సెన్సేష‌న్!
Advertisement
Ads by CJ

కోటి వ్యూస్‌తో సెన్సేష‌న్ క్రియేట్ చేస్తోన్న సాయితేజ్ ‘నో పెళ్లి...’ సాంగ్

సుప్రీమ్ హీరో సాయితేజ్ హీరోగా ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ శ్రీ వెంక‌టేశ్వ‌ర సినీ చిత్ర ఎల్‌.ఎల్‌.పి బ్యాన‌ర్‌పై బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మిస్తోన్న చిత్రం ‘సోలో బ్ర‌తుకే సో బెట‌ర్‌’. సుబ్బు ద‌ర్శ‌కుడిగా ప‌రిచయం అవుతున్నారు. న‌భా న‌టేశ్ హీరోయిన్‌గా న‌టిస్తుంది. ఈ సినిమా విడుద‌ల‌కు సిద్ధ‌మ‌వుతోంది. ఈ సినిమాలో తొలి వీడియో సాంగ్ ‘నో పెళ్లి..’ రీసెంట్‌గా విడుద‌లైన సంగ‌తి తెలిసిందే. 

విడుద‌లైనప్ప‌టి నుండే సోష‌ల్ మీడియాలో ఈ సాంగ్ ట్రెండ్ క్రియేట్ చేసింది. మ్యూజిక్ సెన్సేష‌న్ ఎస్‌.ఎస్‌.త‌మ‌న్ సంగీతం పెద్ద ఎసెట్‌గా నిలిచింది. మ‌రో ప‌క్క సాయితేజ్‌తో పాటు రానా, వ‌రుణ్ తేజ్ ఈ పాట‌లో క‌నిపించ‌డం మ‌రో ప్ల‌స్ అయ్యింది. పాట యూత్‌లోకి దూసుకెళ్లింది. ఇదే పాట‌ను టాలీవుడ్ సింగ‌ర్స్ అంద‌రూ క‌లిసి నో పెళ్లి క‌వ‌ర్ సాంగ్ అనే పాడటం విశేషం. ఇలా రోజు రోజుకీ ఈ పాట‌కు ఆద‌ర‌ణ పెరుగుతూనే ఉంది. తాజాగా సోష‌ల్ మీడియాలో ఈ పాట ఓ అరుదైన రికార్డ్‌ను ట‌చ్ చేసింది. కోటి (10 మిలియ‌న్‌) వ్యూస్ ద‌క్కించుకుని అంద‌రినీ ఆక‌ట్టుకుంటుంది. ఈ పాట‌ను రఘురామ్ రాయ‌గా.. అర్మాన్ మాలిక్ పాట‌ను పాడారు. త్వ‌ర‌లోనే ఈ సినిమా విడుద‌ల‌పై నిర్మాత‌లు అధికారిక ప్ర‌క‌ట‌న చేస్తారు.  

న‌టీన‌టులు:

సాయితేజ్‌, న‌భా న‌టేశ్ త‌దిత‌రులు

సాంకేతిక వ‌ర్గం:

ద‌ర్శ‌క‌త్వం: సుబ్బు

నిర్మాత‌: బీవీఎస్ఎన్‌.ప్ర‌సాద్‌

ఆర్ట్‌: అవినాష్ కొల్ల‌

ఎడిట‌ర్‌: న‌వీన్ నూలి

సంగీతం: త‌మ‌న్‌

సినిమాటోగ్ర‌ఫీ: వెంక‌ట్ సి.దిలీప్‌

Sai Tej Movie Song Creates Sensation in Social Media:

No pelli Movie Song Creates Sensation in Social Media

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ