Advertisementt

సోషల్ మీడియాని షేక్ చేయడానికి రెడీ అవుతున్న హీరో ఫ్యాన్స్..!

Sat 13th Jun 2020 05:38 PM
hero vijay birthday,kollywood,master,kuttystory,tamil,ajith  సోషల్ మీడియాని షేక్ చేయడానికి రెడీ అవుతున్న హీరో ఫ్యాన్స్..!
Vijay fans are planning to create recordss..! సోషల్ మీడియాని షేక్ చేయడానికి రెడీ అవుతున్న హీరో ఫ్యాన్స్..!
Advertisement
Ads by CJ

తమిళ నటుడు ఇళయదలపతి విజయ్ కి అభిమానులు చాలా ఎక్కువే. ఆయన సినిమా నుండి ఏ చిన్న అప్టేట్ వచ్చినా వాళ్ళు చేసే రచ్చ అంతా ఇంతా కాదు. పనిగట్టుకుని మరీ సోషల్ మీడియా వేదికగా రికార్డు క్రియేట్ చేయడానికి రెడీ అయిపోతారు. ఇలాంటి రికార్డుల విషయంలో అజిత్ అభిమానులతో పోటీ పడుతుంటారు. మా హీరో గొప్పంటే మా హీరో గొప్ప అని ఫ్యాన్ వార్స్ కూడా జరుగుతుంటాయి. 

వాటన్నింటినీ పక్కన పెడితే తాజాగా విజయ్ అభిమానులు తమ అస్త్రాల్ని సిద్ధం చేసుకుంటున్నారు. మరికొద్ది రోజుల్లో విజయ్ తన పుట్టినరోజుని జరుపుకుంటున్నాడు. చిన్న టీజర్ లకే రికార్డులని ట్రెండ్ చేసే అభిమానులు తమ హీరో పుట్టినరోజుని ఏ లెవెల్లో సెలెబ్రేట్ చేస్తారో చెప్పక్కర్లేదు. ఈ నెల 22వ తేదీన పుట్టినరోజు జరుపుకునే విజయ్ కోసం అభిమానులు పెద్ద పెద్ద ప్లాన్లతో వస్తున్నారు.

అందుకోసం ఇప్పటి నుండే ప్లాన్స్ స్టార్ట్ అయ్యాయి. కరోనా మూలంగా తన పుట్టినరోజుని గుంపులుగా ఉండి జరుపుకోవద్దని విజయ్ విన్నవించడంతో ఆన్ లైన్ వేదికగా ట్రెండ్ సెట్ చేద్దామని డిసైడ్ అయ్యారు. ఇప్పటి వరకూ ఏ హీరోకి రానన్ని బర్త్ డే విషెస్ తో సరికొత్త ట్రెండ్ సెట్ చేయాలని చూస్తున్నారు. 22వ తేదీ ఎన్ని రికార్డులు సృష్టిస్తారో చూడాలి.

Vijay fans are planning to create recordss..!:

Vijay fans are planning to create recordss..!

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ