Advertisementt

మాస్ డైరెక్టర్ నిర్మాతతో చేతులు కలుపుతున్నాడు..?

Sat 13th Jun 2020 05:14 PM
harish shankar,bunny vasu,pawan kalyan,vakeel saab  మాస్ డైరెక్టర్ నిర్మాతతో చేతులు కలుపుతున్నాడు..?
Mass director going to Produce a movie..? మాస్ డైరెక్టర్ నిర్మాతతో చేతులు కలుపుతున్నాడు..?
Advertisement
Ads by CJ

గబ్బర్ సింగ్ సినిమాతో పవన్ కళ్యాణ్ అభిమానులకి మర్చిపోలేని బహుమతిని అందించిన హరిష్ శంకర్, ఆ సినిమా తర్వాత స్టార్ డైరెక్టర్ గా మారిపోయాడు. మొన్నటికి మొన్న వరుణ్ తేజ్ హీరోగా గద్దలకొండ గణేష్ సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నాడు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ తో మరో చిత్రాన్ని తెరకెక్కించాలని చూస్తున్నాడు. అయితే పవన్- హరీష్ కాంబోలో సినిమా తెరకెక్కడానికి చాలా టైమ్ పట్టేలా ఉంది.

అందువల్ల ఈ గ్యాప్ లో మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకి రాబోతున్నాడు. అయితే దర్శకుడిగా కాదు. నిర్మాతగా. చాలా మంది దర్శకులు నిర్మాతగా మారడం మనం చూస్తూనే ఉన్నాం. వాళ్లలాగే హరీష్ శంకర్ కూడా నిర్మాతగా తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాడు. గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ బన్నీ వాసుతో చేయికలిపి నూతన దర్శకుడు దీపక్ తో సినిమా రూపొందనుందట. ఈ విషయమై మరికొద్ది రోజుల్లో అధికారిక సమాచారం రానుందట.

దర్శకుడిగా సూపర్ సక్సెస్ అయిన హరీష్ శంకర్ నిర్మాతగా చేస్తున్న ప్రయత్నం కూడా విజయాన్ని తెచ్చిపెడుతుందేమో చూడాలి. అయితే ఈ సినిమాలో హీరోగా ఎవరు నటిస్తారనే విషయం తెలియాలి. 

Mass director going to Produce a movie..?:

Harish shankar as producer

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ