కరోనా లాక్‌డౌన్‌తో మొన్నటివరకు అన్ని షాపులతో పాటుగా మద్యం షాపులను బంద్ చేసింది కేంద్ర ప్రభుత్వం. అయితే ప్రభుత్వానికి ఆదాయం కోసం మళ్లీ మద్యం షాపులను అన్ని రాష్ట్రాలు తెరిచాయి. అయితే కొన్ని రాష్ట్రాలు మధ్యం ధరలను అమాంతం పెంచడంతో మధ్యం ప్రియులకి భారీ షాక్ తగిలింది. అయితే మధ్యం ధరలు ఏపీతో పాటుగా పలు రాష్ట్రాల్లో పెరగడంతో.. ఏపీలోకి అక్రమ మద్యంని రవాణా చేస్తూ రోజూ కొంతమంది పట్టుబడుతూనే ఉన్నారు. ఇక చాలా చోట్ల మద్యం అక్రమ రవాణా జరగడం సర్వసాధారణం అయ్యింది.
అయితే తాజాగా మాజీ హీరోయిన్ రమ్యకృష్ణ కారులో మద్యం అక్రమ రవాణా ఇప్పుడు అందరిని షాక్ కి గురి చేసింది. రమ్యకృష్ణ కారులో భారీగా మధ్యం పట్టుబడింది. రమ్యకృష్ణ ఆమె సోదరి వినయ్ కృష్ణన్ కారులో డ్రైవర్ తో సహా ప్రయాణిస్తుంటే... మధ్యలో కానత్తూరు వద్ద రమ్యకృష్ణ కారుని పోలీసులు తనిఖీ చేసారు. అయితే పోలీస్‌ల తనిఖీల్లో రమ్యకృష్ణ కారులో ఏకంగా 96 బీరు సీసాలు, 8 విస్కీ బాటిల్స్ ని పోలీస్ లు స్వాధీనం చేసుకున్నారు. పోలీస్ ల తనిఖీల సమయంలో కారులో రమ్యకృష్ణ, తన సోదరితో సహా ఉన్నారని.. అయితే పోలీస్ లు రమ్యకృష్ణ డ్రైవర్ ని అదుపులోకి తీసుకుని అతనిపై కేసు నమోదు చేసినట్లుగా తెలుస్తుంది.