మహేష్ బాబు కరోనా లాక్‌డౌన్‌లో ఫ్యామిలీతో ఇంట్లోనే ఫుల్‌గా ఎంజాయ్ చేస్తున్నాడు. పిల్లలతో ఆన్ లైన్ గేమ్స్, అల్లరి అబ్బో మహేష్ బాబు కూడా చిన్న పిల్లాడిలా మారిపోయాడు. అయితే మే 31న సూపర్ స్టార్ కృష్ణ బర్త్ డే కి మహేష్ -పరశురామ్ మూవీ ‘సర్కారు వారి పాట’ సైలెంట్ గా ఫస్ట్ లుక్ తోనే మొదలైంది. అయితే ఈ సినిమా స్క్రిప్ట్ తో పాటుగా నటుల ఎంపిక చేపట్టిన పరశురామ్ ఈ సినిమాని సెప్టెంబర్ నుండి సెట్స్ మీదకి తీసుకెళ్లేందుకు వ్యూహాలు పన్నాడు. హీరోయిన్ కియారా అద్వానీ పేరు వినబడినా తాజాగా బాలీవుడ్‌లో మరో హీరోయిన్ పేరు ప్రచారంలోకి రావడం సర్కారు వారు పాటలో మహేష్ విలన్ గా ఈగ సుదీప్ పేరు బయటికి రావడంతో అందరూ మహేష్ సినిమా సెప్టెంబర్ లోనే సెట్స్ మీదకెళుతుంది అని ఫిక్స్ అయ్యారు.
అయితే తాజాగా మహేష్ అండ్ టీం సర్కారు వారి పాటను డిసెంబర్ నుండి మొదలెడదామని చెబుతున్నారట. కారణం కరోనా ఉదృతి తగ్గాక కూల్ గా సెట్స్ మీదకెళదాం అని చెబుతున్నాడట. లాక్ డౌన్ సడలింపులతో కరోనా భీభత్సంగా పెరగడంతో.. ప్రస్తుతం పరిస్థితులు అనుగుణంగా లేకపోవడం వల్లనే ఈ సినిమాని మరో మూడు నెలలు షూట్ కి వెళ్లకుండా బ్రేక్ వేస్తున్నట్టుగా ఫిలింనగర్ టాక్. అసలు ఇప్పుడు ప్రభుత్వం ఇచ్చిన అనుమతులతో షూట్ మొదలెట్టినా అనేక ఆంక్షలు, మితిమీరిన జాగ్రత్తలు తీసుకోవాలి. అందుకే కూల్ గా కరోనా ప్రభావం తగ్గుముఖం పట్టాకే సర్కారు వారి పాటని సెట్స్ మీదకి తీసుకెల్దామని మహేష్ అండ్ నిర్మాతలు ఫిక్స్ అయ్యారట.