Advertisementt

అప్పుడు ‘సహచరుడు’.. ఇప్పుడు ‘అనుచరుడు’!

Sat 13th Jun 2020 02:59 PM
anucharudu movie launch,anucharudu,anucharudu movie,rk goud,prabhakar ippa  అప్పుడు ‘సహచరుడు’.. ఇప్పుడు ‘అనుచరుడు’!
Anucharudu Movie Launched అప్పుడు ‘సహచరుడు’.. ఇప్పుడు ‘అనుచరుడు’!
Advertisement
Ads by CJ

వెరీగుడ్ సినీ స్కూల్ పతాకంపై ప్రభాకర్ ఇప్ప స్వీయ దర్శకత్వంలో రూపొందుతున్న మెసేజ్ ఓరియెంటెడ్ ఎంటర్‌టైనర్ ఫిల్మ్ ‘అనుచరుడు’. ఈ చిత్రం శుక్రవారం పూజాకార్యక్రమాలతో ప్రారంభమైనది. తెలంగాణ రాష్ట్ర ఇండస్ట్రీయల్ ఛైర్మన్ బాల మురళి, తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ అధ్యక్షుడు ఆర్ కె గౌడ్ సంయుక్తంగా పూజాకార్యక్రమాలు నిర్వహించారు. ఇంకా ఈ కార్యక్రమంలో దర్శకుడు వరకోటి, బీసీ సెల్ రాష్ట్ర సెక్రటరీ రిషి కుమార్, లిరిక్ రైటర్ రామారావు, సంగీత దర్శకుడు సాయి శ్రీనివాస్, ఆర్టిస్ట్ చిట్టిబాబు, డ్యాన్స్ మాస్టర్ బండ్ల రామారావు, కెమెరామెన్ వెంకట్ తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఆర్ కె గౌడ్ మాట్లాడుతూ.. మా సిద్ధిపేట వాస్తవ్యుడైన ప్రభాకర్ గతంలో ‘సహచరుడు’ సినిమా తీసి 5 భాషలలో రిలీజ్ చేశాడు. ఇప్పుడు ‘అనుచరుడు’గా రాబోతున్నారు. అతనికి తెలంగాణ ఫిలిం ఛాంబర్ ఎప్పుడూ సపోర్ట్‌గా ఉంటుంది అని తెలియచేస్తున్నాను అని చెప్పారు.  

హీరో ప్రభు మాట్లాడుతూ ‘‘నన్ను అన్నివిధాలా ప్రోత్సహిస్తున్న టీఎఫ్‌సిసి చైర్మన్ ఆర్ కె గౌడ్ గారికి ప్రత్యేక కృతఙ్ఞతలు. ఛాంబర్ గైడ్ లైన్స్‌ని అనుసరించి త్వరలో షూటింగ్ ప్రారంభిస్తాం. ఎక్కడ ఏదీ శాశ్వతం కాదు అనే కాన్సెప్ట్‌తో ఈ చిత్రం నిర్మించబడుతుంది. సబ్జెక్ట్ బాగుంటే ప్రేక్షకులు ఆదరిస్తారు అనే నమ్మకంతో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాను..’’ అని అన్నారు.

ప్రభు, గౌతమ్ రాజు, రంగరాజు, రేలంగి, చిట్టిబాబు, గబ్బర్ సింగ్ గ్యాంగ్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: వెంకట్ కొవూరి, డ్యాన్స్: బండ్ల రామారావు, లిరిక్ రైటర్: రామారావు, కో-డైరెక్టర్: ఈశ్వర్ దామూగట్ల, నిర్మాణం: వెరీ గుడ్ సినీ స్కూల్; కథ-స్క్రీన్‌ప్లే-దర్శకత్వం: ప్రభాకర్ ఇప్ప.

Anucharudu Movie Launched :

Anucharudu Movie Launch details 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ