Advertisementt

సర్కారు వారి పాటకి పరశురామ్ ఎంత తీసుకుంటున్నాడో తెలుసా..?

Fri 12th Jun 2020 04:29 PM
sarkaru vaari paata,mahesh babu,parashuram,mythri movie makers,thaman  సర్కారు వారి పాటకి పరశురామ్ ఎంత తీసుకుంటున్నాడో తెలుసా..?
Parashuram remuneration for Mahesh Sarkaru Vaari Paata.. సర్కారు వారి పాటకి పరశురామ్ ఎంత తీసుకుంటున్నాడో తెలుసా..?
Advertisement
Ads by CJ

సూపర్ స్టార్ క్రిష్ణ పుట్టినరోజుని పురస్కరించుకుని మహేష్ బాబు చిత్రం సర్కారు వారి పాట అనౌన్స్ మెంట్ వచ్చింది. పరశురామ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. గీత గోవిందం సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్న పరశురామ్, స్టార్ హీరోని డైరెక్ట్ చేయడం ఇదే మొదటిసారి. రవితేజని మినహాయిస్తే పరశురామ్ చేసిన చిత్రాలన్నీ మిడ్ రేంజ్ హీరోలతోనే. మరి సూపర్ స్టార్ ని డైరెక్ట్ చేస్తున్న పరశురామ్, సర్కారు వారి పాటకి ఎంత రెమ్యునరేషన్ తీసుకుంటున్నాడనేది ఆసక్తిగా మారింది.

ప్రస్తుతం కరోనా కారణంగా పెద్ద సినిమాల నుండి మొదలు పెడితే చిన్న సినిమాలకి పనిచేసే నటీనటులతో సహా సాంకేతిక నిపుణులందరూ పారితోషికం తగ్గించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో పరశురామ్ సర్కారు వారి పాటకి 7 కోట్ల వరకి రెమ్యునరేషన్ తీసుకుంటున్నాడని అంటున్నారు. నిజానికి ముందుగా 10కోట్లు ఫిక్స్ అయ్యారట. కానీ కరోనా క్రైసిస్ మూలంగా 3కోట్లు తగ్గించుకుని ఏడు కోట్లకి వచ్చిందట. సూపర్ స్టార్ తో సినిమా ఆ మాత్రం ఉండడంలో ఆశ్చర్యపోవాల్సిందేమీ లేదని చెబుతున్నారు.

Parashuram remuneration for Mahesh Sarkaru Vaari Paata..:

Parashuram remuneration for Mahesh Sarkaru Vaari Paata..

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ