Advertisementt

ఫ్లాప్ డైరెక్టర్ తో అనుష్క సినిమా..?

Fri 12th Jun 2020 01:59 PM
anushka shetty,nissabdam,sandeep kishan,ra ra krishnayya,mahesh p  ఫ్లాప్ డైరెక్టర్ తో అనుష్క సినిమా..?
Anushka Shetty Next movie with flop director..? ఫ్లాప్ డైరెక్టర్ తో అనుష్క సినిమా..?
Advertisement
Ads by CJ

బాహుబలి సినిమా ద్వారా దేశవ్యాప్తంగా పేరు తెచ్చుకున్న అనుష్క, ఆ తర్వాత అన్నీ లేడీ ఓరియంటెడ్ సినిమాల్లోనే కనిపిస్తుంది.  సైజ్ జీరో మొదలుకుని, భాగమతి, ఇప్పుడు రిలీజ్ కి రెడీ ఉన్న నిశ్శబ్దంతో కలిపి అన్నీ  హీరోయిన్ ప్రధాన పాత్ర కలిగిన సినిమాలే. నిశ్శబ్దం సినిమా మరికొద్ది రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే ఈ సినిమా అనంతరం అనుష్క చిత్రం ఎవరి దర్శకత్వంలో ఉంటుందనేది క్లారిటీ వచ్చేసింది.

గత రెండు మూడు సినిమాల నుండి పరిశీలిస్తే, ఫ్లాప్ డైరెక్టర్లతోనే సినిమాలని ఒప్పుకుంటున్న అనుష్క, ఈ సారి కూడా ఆ అవకాశం ఫ్లాప్ డైరెక్టర్ కే ఇచ్చింది.సందీప్ కిషన్ హీరోగా నటించిన రారా క్రిష్ణయ్య దర్శకుడు మహేష్ దర్శకత్వంలో అనుష్క హీరోయిన్ గా సినిమా తెరకెక్కనుందట. ఇది కూడా లేడీ ఓరియంటెడ్ చిత్రమేనని సమాచారం. ప్రతిష్టాత్మక బ్యానర్ యూవీ క్రియేషన్స్ ఈ సినిమాని నిర్మించనుందట. 

ఇప్పటికే అనుష్కతో మిర్చి, భాగమతి వంటి సూపర్ హిట్ అందించిన యూవీ క్రియేషన్స్ మరో మారు అనుష్కతో సినిమా తీయడానికి రెడీ అయింది. ఇప్పటికైతే ఈ విషయమై అధికారిక ప్రకటన రాలేదు. నిశ్శబ్దం సినిమా థియేటర్లో రిలీజ్ అయ్యాక తర్వాతి సినిమా ప్రకటన ఉంటుందని భావిస్తున్నారు.

Anushka Shetty Next movie with flop director..?:

Anushka Shetty Next movie with flop director..?

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ