Advertisementt

‘గుండ‌మ్మ క‌థ’ ఫ‌స్ట్ సింగిల్ విడుదల

Sat 13th Jun 2020 01:34 PM
gundamma katha movie,first single,ring tring singer,gundamma katha  ‘గుండ‌మ్మ క‌థ’ ఫ‌స్ట్ సింగిల్ విడుదల
gundamma katha movie first single released ‘గుండ‌మ్మ క‌థ’ ఫ‌స్ట్ సింగిల్ విడుదల
Advertisement
Ads by CJ

ఆదిత్య క్రియేష‌న్స్ - గుండ‌మ్మ క‌థ ఫ‌స్ట్ సింగిల్ ‘రింగ్ ట్రింగ్’ విడుద‌ల‌

ఆదిత్య క్రియేష‌న్స్‌ ప‌తాకం పై ఆదిత్య‌, ప్ర‌ణ‌వ్య‌లు జంట‌గా తెర‌కెక్కిన హోల్స‌మ్ ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్ గుండ‌మ్మ క‌థ‌. ల‌క్ష్మీ శ్రీవాత్స‌వ స్వీయ నిర్మాణంలో కృష్ణంరాజు ద‌ర్శ‌కునిగా తెర‌కెక్కిన ఈ సినిమా ట్రైల‌ర్‌ని ఇటీవ‌లే విడుద‌ల చేసిన సంగ‌తి తెలిసిందే. ఈ ట్రైల‌ర్‌ని నెటిజ‌న్స్ తో పాటు సాదార‌ణ ఆడియన్స్ కూడా విశేషంగా ఆద‌రించారు. ఈ నేప‌థ్యంలో గుండ‌మ్మ‌క‌థ చిత్ర బృందం ఈ సినిమా ఆడియో ఆల్బ‌మ్ నుంచి ఫ‌స్ట్ సింగిల్ విడుద‌ల చేశారు. మ్యూజిక్ డైరెక్ట‌ర్ స‌తీష్ సాధ‌న్ అందించిన ట్యూన్స్‌తో రింగ్ ట్రింగ్ అంటూ సాగిపోయో ఈ పాట‌కు లిరిక్స్ వేగేశ్న శ్రీ విజ‌య అందించారు. ఈశ్వ‌ర్ ఈ పాట‌కు కొరియోగ్రఫి అందించారు. ప్ర‌ముఖ సింగ‌ర్ అనురాగ్ కుల‌క‌ర్ణి ఈ పాట‌ను ఆల‌పించారు. ఇక‌ అల‌‌నాటి గుండ‌మ్మ క‌థ ఏ రేంజ్ లో ప్రేక్ష‌కుల్ని ఎంట‌ర్ టైన్ చేసిందో అంతే స్థాయిలో ఈత‌రం ఆడియన్స్ కి క‌నెక్ట్ అయ్యే రీతిన ల‌వ్, కామెడీ, సెంటిమెంట్ త‌దిత‌ర అంశాల‌తో కూడా స‌న్నివేశాలు తెర‌కెక్కించ‌న‌ట్లుగా చిత్ర బృందం తెలిపింది. క‌‌రోనా నేప‌థ్యంలో థియేట‌ర్స్ లాక్ డౌన్ ముగిసిన వెంట‌నే ఈ చిత్రాన్ని విడుద‌ల చేసేందుకు నిర్మాత‌లు స‌న్నాహాలు చేస్తున్నారు.

న‌టీ న‌టులు - ఆదిత్య‌, ప్ర‌ణ‌వ్య‌, గెటప్ శ్రీను, భాష త‌దిత‌రులు

టెక్నీషియ‌న్లు

కెమెరా - మోనీష్ భూప‌తి

ఎడిట‌ర్ - ప్ర‌వీణ్ పూడి

మ్యూజిక్ - స‌తీష్ సాధ‌న్‌

లిరిక్స్ - వేగ్నేశ్న శ్రీ విజ‌య‌

క‌థ‌, డైలాగ్స్, స్క్రీన్ ప్లే - ల‌క్ష్మీ శ్రీవాత్స‌వ‌

నిర్మాత - ల‌క్ష్మీ శ్రీవాత్స‌వ‌

ద‌ర్శ‌క‌త్వం - ల‌క్ష్మీ శ్రీవాత్స‌వ‌, కృష్ణం రాజు

బ్యాన‌ర్ - ఆదిత్య మూవీస్

gundamma katha movie first single released:

gundamma katha movie Latest Update

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ