Advertisementt

పొట్ట‌తో మోక్ష‌జ్ఞ లేటెస్ట్ లుక్‌.. ఇప్ప‌ట్లో ఎంట్రీ డౌట్‌!

Fri 12th Jun 2020 06:47 PM
mokshagna,latest look,balayya birthday,fans,disappoint,cine entry  పొట్ట‌తో మోక్ష‌జ్ఞ లేటెస్ట్ లుక్‌.. ఇప్ప‌ట్లో ఎంట్రీ డౌట్‌!
Doubts on Nandamuri Mokshagna Cine Entry పొట్ట‌తో మోక్ష‌జ్ఞ లేటెస్ట్ లుక్‌.. ఇప్ప‌ట్లో ఎంట్రీ డౌట్‌!
Advertisement
Ads by CJ

మోక్ష‌జ్ఞ‌.. న‌ట‌సింహ బాల‌కృష్ణ గారాల త‌న‌యుడు.. సినిమాల్లో హీరోగా ఎప్పుడు ఎంట్రీ ఇస్తాడా అని ఫ్యాన్స్ ఆత్రుత‌గా ఐదారేళ్ల నుంచీ ఎదురు చూస్తూ వ‌స్తున్నారు. జూనియ‌ర్ ఎన్టీఆర్ టీనేజ్‌లో ఉండ‌గానే హీరో అయిన‌ట్లు మోక్ష‌జ్ఞ కూడా అలాగే ఎంట్రీ ఇస్తాడ‌ని ఇదివ‌ర‌కు ఎదురు చూశారు. మోక్ష‌జ్ఞ ఎంట్రీ ఇవ్వ‌లేదు. టీనేజ్ దాటేశాడు. ఇర‌వైల్లోకి అడుగుపెట్టాడు. అప్ప‌ట్నుంచీ ప్ర‌తి ఏటా.. ఈ సంవ‌త్స‌రం హీరోగా వ‌చ్చేస్తున్నాడ‌ని ఆశిస్తూ వ‌చ్చారు. మోక్ష‌జ్ఞ రాలేదు. ఇప్పుడత‌ను పాతికేళ్ల యువ‌కుడు. కొద్ది కాలంగా అతని ప‌రిచ‌య చిత్రం త్వ‌ర‌లోనే ఉంటుంద‌నే ప్ర‌చారం బ‌లంగా వినిపిస్తోంది. దీంతో నంద‌మూరి అభిమానులు సోష‌ల్ మీడియా వేదిక‌గా ఆనందం వ్య‌క్త‌ప‌రుస్తున్నారు.

కానీ.. జూన్ 10న బాల‌కృష్ణ 60వ పుట్టిన‌రోజు వేడుక‌లో మోక్ష‌జ్ఞ క‌నిపించాడు. అంతే.. బాల‌య్య ఫ్యాన్స్ ఆనందానికి అడ్డుక‌ట్ట ప‌డింది. వాళ్ల ఆశ‌ల‌కు గండిప‌డింది. కార‌ణం.. మోక్ష‌జ్ఞ లుక్‌!! అవును. పొట్ట పెరిగి, లూజ్ బాడీతో హీరో ఎంట్రీకి కావాల్సిన ఫిజిక్‌కు ఆమ‌డ దూరంలో ఉన్న‌ట్లు క‌నిపించాడు మోక్ష‌జ్ఞ‌. దీంతో అత‌ను ఇప్ప‌ట్లో హీరో అయ్యే అవ‌కాశాలు లేవ‌ని అర్థ‌మైపోతోంది. లేన‌ట్ల‌యితే ఈ పాటికి మంచి ఫిజిక్‌తో క‌నిపించేవాడే! ఇవాళ్టి రోజుల్లో హీరోలు ఎలా క‌నిపిస్తున్నారో మ‌నం చూస్తున్నాం. నాగార్జున కొడుకు అఖిల్ తొలి మూవీలోనే సిక్స్ ప్యాక్‌తో ద‌ర్శ‌న‌మిచ్చాడు. కండ‌లు తిరిగిన దేహాకృతికి హీరోలు ప్రాధాన్యం ఇస్తున్నారు. చిన్నా పెద్దా తేడా లేకుండా అంద‌రూ సిక్స్ ప్యాక్‌లు చేసేస్తున్నారు. క‌నీసం చ‌క్క‌ని లుక్ ఉండేలా చూసుకుంటున్నారు.

మోక్ష‌జ్ఞ‌లో ఆ ధ్యాస కాస్త కూడా ఉన్న‌ట్లు క‌నిపించ‌డం లేదు. అస‌ల‌త‌నికి హీరోగా సినిమాల్లో న‌టించాల‌నే ఆస‌క్తి అస‌లు ఉందా?.. అనే సందేహం చాలా మందికి వ‌చ్చింది. త‌న బ‌ర్త్‌డే సంద‌ర్భంగా ఇచ్చిన ఇంట‌ర్వ్యూల్లో మోక్ష‌జ్ఞ హీరోగా వ‌స్తాడ‌నీ, అందుకోసం ఇప్ప‌టికే కొన్ని స్క్రిప్ట్ ఐడియాల‌ను ఓకే చేశాన‌ని చెప్పాడు. కాక‌పోతే పూరి జ‌గ‌న్నాథ్ డైరెక్ష‌న్‌లో మోక్ష‌జ్ఞ‌ను లాంచ్ చేస్తున్న‌ట్లు జ‌రుగుతున్న ప్ర‌చారాన్ని మాత్రం ఖండించాడు. ఆయ‌న మాట‌లు ఎలా ఉన్న‌ప్ప‌టికీ, ఔటాఫ్ షేప్‌తో ఉన్న మోక్ష‌జ్ఞ ఎలా హీరోగా ఎంట్రీ ఇస్తాడంటూ చాలా మంది ఆశ్చ‌ర్యాన్ని ప్ర‌క‌టిస్తున్నారు. ప్ర‌ధానంగా ఫ్యాన్స్ అత‌ని లేటెస్ట్ లుక్ చూసి బాగా డిజ‌ప్పాయింట్ అయ్యారు. ఇప్ప‌టికే పాతికేళ్లు దాటిన అత‌ను ఇంకెప్పుడు హీరో కావ‌డానికి రెడీ అవుతాడంటూ సోష‌ల్ మీడియాలో అసంతృప్తి వ్య‌క్తం చేస్తున్నారు.

Doubts on Nandamuri Mokshagna Cine Entry:

Fans Disappointed with Mokshagna latest Look

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ