Advertisementt

ఆ డైరెక్టర్ కి మిగిలింది చిన్న హీరోలేనా..?

Thu 11th Jun 2020 04:25 PM
surender reddy,mahesh babu,chiranjeevi,ntr,ram charan,star hero,  ఆ డైరెక్టర్ కి మిగిలింది చిన్న హీరోలేనా..?
Syera Director to direct a film with small hero..? ఆ డైరెక్టర్ కి మిగిలింది చిన్న హీరోలేనా..?
Advertisement
Ads by CJ

మెగాస్టార్ చిరంజీవి నటించిన సైరా నరసింహారెడ్డి సినిమాతో పాన్ ఇండియాలో మెరిసిన దర్శకుడు సురేందర్ రెడ్డి, ఆ సినిమా విడుదలై చాలా రోజులవుతున్న తన తర్వాతి చిత్రం ఏ హీరోతో ఉంటుందనేది ప్రకటించలేదు. సైరా సినిమా రిలీజ్ అయ్యాక ప్రభాస్ తో సినిమా ఉందని, మహేష్ తో ఉందని వార్తలు వచ్చినప్పటికీ అవేవీ కన్ఫర్మ్ అవలేదు. అయితే ప్రస్తుతం సురేందర్ రెడ్డి దర్శకత్వంలో సినిమా చేయడానికి ఏ స్టార్ హీరో కూడా ఖాళీగా లేడు.

ఎన్టీఆర్- రామ్ చరణ్, రాజమౌళి ఆర్ ఆర్ ఆర్ సినిమాతో బిజీగా ఉన్నారు. ప్రభాస్ ప్రస్తుతం చేస్తున్న సినిమానే కాకుండా తర్వాతి సినిమా కూడా ప్రకటించేసాడు. అల్లు అర్జున్ పుష్ప, మహేష్ బాబు సర్కారు వారి పాట సినిమాలు స్టార్ట్ కానున్నాయి. ఇలా చూసుకుంటూ వెళ్తే స్టార్ హీరోలందరూ వారి వారి సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నారు. దీంతో సురేందర్ కి మిగిలింది చిన్న హీరోలే. మీడియం రేంజ్ హీరోలు సైతం తమ తమ ప్లాన్లలో ఉన్నారు.

మరి ఈ టైమ్ లో సురేందర్ రెడ్డి చిన్న హీరోతో సినిమా చేస్తాడా లేదా అన్నది సందేహం. ఎందుకంటే ఇప్పటి వరకూ సురేందర్ రెడ్డి చేసిన సినిమాలన్నీ స్టార్ హీరోలతోనే. మొదటి సినిమా కళ్యాణ్ రామ్ తో తీసిన సురేందర్ రెడ్డి, ఆ తర్వాత ఎన్టీఆర్, రవితేజ, మహేష్, రామ్ చరణ్, చిరంజీవిలతో సినిమాలు తీశాడు. మరి స్టార్లందరితో సినిమాలు చేసిన ఈ దర్శకుడు ఒక్కసారిగా చిన్న హీరోతో సినిమా చేస్తాడా లేదా స్టార్ హీరో దొరికే వరకూ వెయిట్ చేస్తాడా అనేది చూడాలి.

Syera Director to direct a film with small hero..?:

Syera Director to direct a film with small hero..?

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ