టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ అంధాధున్ చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. బాలీవుడ్ లో సూపర్ హిట్ సాధించిన ఈ చిత్రంలో ఆయుష్మాన్ ఖురానా హీరోగా నటించాడు. సీనియర్ హీరోయిన్ టబు కీలకమైన పాత్రలో కనిపించింది. శ్రీరామ్ రాఘవన్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో హీరోయిన్ గా రాధికా ఆప్టే నటించింది. అయితే తెలుగులో రీమేక్ అవుతున్న ఈ సినిమాలో కీలకమైన టబు పాత్రలో బాలీవుడ్ హాట్ బ్యూటీ శిల్పాశెట్టి నటించనుందని వార్తలు వస్తున్నాయి.
మరి రాధికా ఆప్టే పాత్రలో ఎవరు కనిపించనున్నారనేది సస్పెన్స్ గా మారింది. తాజా సమాచారం ప్రకారం నితిన్ తో రొమాన్స్ చేయడానికి ఇస్మార్ట్ భామ నభా నటేష్ ని తీసుకోనున్నారని వినిపిస్తుంది. ఇప్పటికైతే ఈ విషయమై ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. మేర్లపాక గాంధీ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాని నితిన్ నాన్నగారు సుధాకర్ రెడ్డి శ్రేష్ట్ మూవీస్ బ్యానర్ లో నిర్మిస్తున్నారు. మరి అంధాధున్ మ్యాజిక్ ని నితిన్ రీమేక్ రిపీట్ చేస్తుందా లేదా చూడాలి.