నందమూరి బాలకృష్ణకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్
నటసింహ నందమూరి బాలకృష్ణ 60వ జన్మదినం సందర్భంగా సినీ, రాజకీయ ప్రముఖులు, అభిమానులు శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందరరాజన్ బాలయ్య కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఇందుకు స్పందిస్తూ నందమూరి బాలకృష్ణ గవర్నర్ కు కృతజ్ఞతలు తెలిపారు, తెలంగాణ గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందరరాజన్ గారి నుండి జన్మదిన శుభాకాంక్షలు అందుకోవడం చాలా సంతోషంగా ఉందని ఆవిడకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.
జాంబియాలో బాలయ్య బర్త్‌డే సెలబ్రేషన్స్ జరిపిన అభిమానులు
తమ అభిమాన హీరో పుట్టినరోజు వస్తుందంటే అభిమానులకు పండుగే. ఎక్కడున్నా తమ అభిమాన హీరో పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహిస్తుంటారు అభిమానులు. జూన్10 నటసింహ నందమూరి బాలకృష్ణ 60వ పుట్టినరోజు సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్నఆయన అభిమానులు సంబరాలు చేసుకున్నారు. అలాగే పలు సంక్షేమ సేవా కార్యక్రమాలు నిర్వహించారు. దీనిలో భాగంగా జాంబియాలో నటసింహ నందమూరి బాలకృష్ణ పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు ఆయన అభిమానులు. కేక్ కట్ చేసి ఆయన పాటలకు డ్యాన్సులు వేస్తూ సెలబ్రేట్ చేసుకున్నారు. ఈ సందర్భంగా జాంబియాలోని కొన్ని అనాథాశ్రమానికి నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు.