బాలకృష్ణ కొడుకు మోక్షజ్ఞ వెండితెర అరంగేట్రం కోసం నందమూరి అభిమానులు 2018 బాలయ్య పుట్టిన రోజు నుండి కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నారు. బాలయ్య ఇదిగో అదిగో కొడుకు వెండితెర ఎంట్రీ అని చెప్పడమే కానీ... అది మాత్రం జరగడం లేదు. ఈమధ్యలో మోక్షజ్ఞ లీకెడ్ పిక్స్ లో మోక్షజ్ఞ బరువు పెరిగిపోయి.. హీరోలా కాకుండా లావుగా కనబడడంతో నందమూరి ఫ్యాన్స్ వర్రీ అవుతూనే ఉన్నారు. 2020 బాలకృష్ణ పుట్టిన రోజు సందర్భంగా ఇచ్చిన పలు ఇంటర్వూస్ లో బాలకృష్ణ తన కొడుకు సినిమా ఎంట్రీ ఎప్పుడు కావాలంటే అప్పుడు ఉంటుంది.. మోక్షజ్ఞ ఎప్పుడు రెడీ అంటే అప్పుడే.. తధాస్తు దేవతలు దీవిస్తే ఏ టైం అయినా కెమెరా ముందుకువచ్చేస్తాడంటూ చెప్పడమే కాదు.. మోక్షజ్ఞ్నే నందమూరి నట వారసత్వాన్ని ముందుకు తీస్కెళ్ళే నట వారసుడు అంటూ బాలయ్య చెప్పేసాడు.
ఇంకేంటి మోక్షజ్ఞ అతి త్వరలోనే సినిమాల్లోకి వచ్చేస్తాడంటూ... ఫిక్స్ అవుతుంటే.. నిన్న బాలయ్య పుట్టిన రోజు వేడుకలు కేవలం బాలయ్య ఫ్యామిలీ, నారా చంద్రబాబు ఫ్యామిలీ తో చాలా సింపుల్ గా జరిగాయి. అయితే ఆ ఫ్యామిలీ సెలెబ్రేషన్స్ లో మోక్షజ్ఞ బాలయ్యకి కేక్ తినిపిస్తున్న పిక్ అన్నిటిలో హైలెట్ గా నిలిచింది కానీ.. ఆ పిక్ లో మోక్షజ్ఞ పొట్ట చూస్తే అమ్మో ఆ పొట్టెందయ్యా సామి.. హీరోలా కనబడతావ్ అనుకుంటే ఇలా బరువు పెరిగి మమ్మల్ని బాగా డిజప్పాయింట్ చేస్తున్నావ్ అంటూ నందమూరి అభిమానులు బాగా హార్ట్ అవుతున్నారు. గతంలో మోక్షజ్ఞ ఇలానే బాగా బరువుతో కనబడితే.. ఇప్పుడు కాస్త బరువు తగ్గి బాగా పొట్ట పెంచేసాడు. మరి హీరో అంటే ఇలా ఉంటే ఎవరికీ అనడు.. కానీ మోక్షజ్ఞ అసలేం అనుకుంటున్నాడో అనేది బాలయ్యకి కూడా తెలియదేమో... అందుకే బాలయ్య మోక్షజ్ఞ ఎనీ టైం సినిమా ఎంట్రీ అంటూ చెబుతున్నాడు.