Advertisementt

BB3 టీజ‌ర్ స్పందనపై బాలయ్య స్పందన ఇదే!

Thu 11th Jun 2020 06:18 PM
bb3 teaser,balakrishna,terrific,natasimha big range  BB3 టీజ‌ర్ స్పందనపై బాలయ్య స్పందన ఇదే!
Balakrishna Response on BB3 First Roar Response BB3 టీజ‌ర్ స్పందనపై బాలయ్య స్పందన ఇదే!
Advertisement
Ads by CJ

BB3 టీజ‌ర్ అదిరిపోయింది అంటున్నారు అంద‌రూ.. సినిమా కూడా అంత పెద్ద రేంజ్‌లో ఉంటుంది - న‌ట‌సింహ నంద‌మూరి బాల‌కృష్ణ

‘సింహా’, ‘లెజెండ్’ వంటి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్స్ త‌ర్వాత‌ నటసింహ నందమూరి బాలకృష్ణ, మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేష‌న్‌లో హ్యాట్రిక్ మూవీ రూపొందుతోంది. మిర్యాల స‌త్య‌నారాయ‌ణ రెడ్డి స‌మ‌ర్ప‌ణ‌లో ద్వారక క్రియేషన్స్ బ్యానర్ పై యువ నిర్మాత మిర్యాల రవీందర్ రెడ్డి అత్యంత ప్రెస్టీజియస్ గా ఈ మూవీని నిర్మిస్తున్నారు. నటసింహ నందమూరి బాలకృష్ణ పుట్టిన‌రోజు కానుక‌గా #BB3 First Roar  పేరుతో విడుద‌ల‌చేసిన టీజ‌ర్ ఒక్క రోజులోనే 6మిలియ‌న్ డిజిట‌ల్ వ్యూస్ దాటి ఇండియాలోనే నెంబ‌ర్ వ‌న్ ట్రెండింగ్‌లోకి వ‌చ్చింది. 

ఈ సంద‌ర్భంగా న‌ట‌సింహ నంద‌మూరి బాల‌కృష్ణ మాట్లాడుతూ.. ‘‘బోయ‌పాటి గారితో చేస్తున్న సినిమా గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌వ‌స‌రం లేదు. మా కాంబినేష‌న్‌లో వ‌స్తోన్న‌ మూడో సినిమా ఇది. బోయ‌పాటి బాల‌కృష్ణ సినిమా అంటే ఆ వైబ్రేష‌న్స్ అలానే ఉంటాయి. మా ఇద్ద‌రికీ మంచి అండ‌ర్ స్టాండింగ్ ఉంటుంది. టీజ‌ర్ ఇండియాలోనే నెంబ‌ర్ వ‌న్‌ ట్రెండింగ్‌లో ఉంది. టీజ‌ర్‌ను చూసి సినిమా కోసం ఎంత ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారో తెలుసు. సినిమాపై భారీ అంచ‌నాలున్నాయి. సాధార‌ణంగా నేను, బోయ‌పాటిగారు చాలా స్పీడుగా సినిమా పూర్తి చేస్తాం. షూటింగ్స్ మ‌ళ్ళీ స్టార్ట్ అయ్యాక ఈ సినిమాను రెట్టింపు వేగంతో పూర్తి చేసి సినిమాను ప్రేక్ష‌కుల ముందుకు తీసుకొస్తాం. నిర్మాత మిర్యాల రవీందర్ రెడ్డి చాలా పెద్ద స్థాయిలో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. నా పుట్టిన రోజు సంద‌ర్భంగా ఎంద‌రో ప్రముఖులు, చాలా మంది అభిమానులు  విషెస్‌ చెప్పారు. ఈ క‌రోనా ప‌రిస్థితుల్లో కూడా ప్రభుత్వ నిబంద‌న‌ల‌ను పాటిస్తూనే అంద‌రికీ ఆద‌ర్శంగా ఉంటూ నా పుట్టిన రోజు నాడు  ఎన్నో సంక్షేమ‌ సేవా కార్య‌క్ర‌మాలను చేపట్టినందుకు, రికార్డ్ సృష్టించ‌డానికి చేసిన కేక్ క‌టింగ్స్‌లో పాల్గొన్న ప్ర‌తి ఒక్క‌రికీ నా హృద‌య‌పూర్వ‌క అభినంద‌న‌లు, హృద‌య‌పూర్వ‌క కృత‌జ్ఞ‌త‌లు తెలియ‌జేస్తున్నాను’’ అన్నారు.

నటసింహ నందమూరి బాలకృష్ణ హీరోగా నటిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: సి. రాంప్రసాద్‌, సంగీతం: థమన్‌ ఎస్‌‌, మాటలు: ఎం.రత్నం, ఆర్ట్‌ డైరెక్టర్‌: ఎ.ఎస్‌.ప్రకాష్‌, ఎడిటింగ్‌: కోటగిరి వేంకటేశ్వరరావు, తమ్మిరాజు, ఫైట్స్‌: రామ్‌-ల‌క్ష్మ‌ణ్‌, స‌మ‌ర్ప‌ణ‌: మిర్యాల స‌త్య‌నారాయ‌ణ రెడ్డి, నిర్మాత: మిర్యాల రవీందర్‌రెడ్డి, దర్శకత్వం: బోయపాటి శ్రీను.

Balakrishna Response on BB3 First Roar Response :

Everyone Is Saying That The BB3 Teaser Is Terrific... The Film Too Will Be In A Big Range - Natasimha Nandamuri Balakrishna

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ