Advertisementt

ప్రభాస్ 20 అప్డేట్ కి మరికొన్ని రోజులే..?

Wed 10th Jun 2020 03:08 PM
prabhas,pooja hegde,radha krishna,prabhas20  ప్రభాస్ 20 అప్డేట్ కి మరికొన్ని రోజులే..?
Prabhas 20 update will come soon..? ప్రభాస్ 20 అప్డేట్ కి మరికొన్ని రోజులే..?
Advertisement
Ads by CJ

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ 20వ సినిమా అప్డేట్ కోసం అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. రాధాక్రిష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా నుండి ఇంత వరకూ ఒక్క అప్డేట్ కూడా బయటకి రాలేదు. సాహో సినిమా రిలీజ్ కాకముందే కన్ఫర్మ్ అయిన ఈ సినిమా టైటిల్ ఇప్పటి వరకూ రిలీజ్ చేయకపోవడం ఒకింత ఆశ్చర్యం కలిగించే విషయం. అప్డేట్స్ విషయంలో అభిమానులు గోల చేస్తున్నా ఎందుకు పట్టించుకోవడంలో ఎవరికీ అంతుబట్టడం లేదు.

అయితే లాక్డౌన్ స్టార్ట్ అయినపుడు యూవీ క్రియేషన్స్ వారు ఒక ప్రామిస్ చేసారు. లాక్డౌన్ పూర్తయి, షూటింగ్ కి వెళ్ళినపుడు ఖచ్చితంగా అప్డేట్ తో ముందుకు వస్తామని చెప్పారు. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో షూటింగులకి అనుమతి లభించింది. ఈ నేపథ్యంలో ఈ నెలలో ప్రభాస్ సినిమా నుండి అప్డేట్ రానుందని అభిమానులు ఆశగా ఎదురుచూస్తున్నారు. విశ్వసనీయ సమాచారం ప్రకారం ఈ నెల 14వ తేదీన ప్రభాస్ సినిమా టైటిల్ అనౌన్స్ మెంట్ ఉండనుందట.

ఫస్ట్ లుక్ తో పాటు టైటిల్ కూడా ప్రకటిస్తారని సమాచారం. మరి ఈ సారైనా ఈ వార్త నిజమవ్వాలని కోరుకుందాం. పీరియాడికల్ లవ్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తుంది. 

Prabhas 20 update will come soon..?:

Prabhas 20 update will come soon..?

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ