Advertisementt

పవన్ దమ్మున్నోడు.. ప్రభాస్ సిగ్గరి: తమన్నా

Thu 11th Jun 2020 02:17 PM
tamanna,pawan kalyan,mahesh babu,prabhas,tollywood heroes,tamanna chit chat  పవన్ దమ్మున్నోడు.. ప్రభాస్ సిగ్గరి: తమన్నా
Tamanna Talks about Telugu Heroes పవన్ దమ్మున్నోడు.. ప్రభాస్ సిగ్గరి: తమన్నా
Advertisement
Ads by CJ

స్టార్ హీరోలతో అవకాశాలు తగ్గుమొహం పట్టినా.. ఐటెం సాంగ్స్ తోనూ సీనియర్ హీరోల సినిమాల్తోనూ ఎప్పుడూ బిజీగా ఉంటుంది తమన్నా. కరోనా లాక్ డౌన్ లో ఇంట్లోనే ఉంటూ అభిమానులల్తో లైవ్ చాట్ చేస్తుంది. తాజాగా తమన్నా లైవ్ చాట్ లో మాట్లాడుతూ.. ప్రభాస్ లాంటి స్టార్ హీరోతో రెండు సినిమాల్లో నటించాను. ఆయనతో కలిసి పనిచెయ్యడం చాలా బావుంటుంది. ప్రభాస్ చాలా మంచి వ్యక్తి, ఎంతో వినయంగా ఉంటాడు, అంకిత భావంతో పనిచేస్తాడు. తనో పెద్ద స్టార్ అయినా.. అమ్మాయిల గురించి మాట్లాడుతున్నప్పుడు చాలా సిగ్గుపడుతుంటాడని చెప్పింది.

ఇక మెగా హీరోలందరిలో పవన్ కళ్యాణ్ దమ్మున్నోడు అన్న తమన్నా మహేష్ తో పని చెయ్యడం మాత్రం సూపర్ అంటుంది. మహేష్ తో పని చెయ్యడం అంటే ఫన్. మహేష్ సెట్స్ లో చాలా సరదాగా ఉంటాడు. ఆగడు సినిమాలో ఆయనతో నటించాను. మళ్ళీ చాలా రోజులకి ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాలో మహేష్ తో ఐటెం సాంగ్ చేశానంటుంది తమన్నా. ఇక తన చివరి శ్వాస వరకు నటిస్తా అని.. లాక్ డౌన్ సమయంలో నేను ఆవకాయ పచ్చడి చేసాను, ఇది వింటే తెలుగు వాళ్ళు కూడా హ్యాపీగా ఫీలవుతారంటుంది తమన్నా.

Tamanna Talks about Telugu Heroes:

Tamanna Talks about Pawan, Mahesh, Prabhas and Other Heroes 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ