నందమూరి బాలక్రిష్ణ పుట్టినరోజుని పురస్కరించుకుని వారం ముందే అభిమానుల సందడి మొదలైన సంగతి తెలిసిందే. నేడు 60వ పుట్టినరోజుని జరుపుకుంటున్న బాలయ్యకి అటు రాజకీయ నాయకుల నుండి ఇటు సినిమా సెలెబ్రిటీల నుండి శుభాకాంక్షల వెల్లువ వచ్చి పడుతోంది. ఈ నేపథ్యంలో జూనియర్ ఎన్టీఆర్ తనదైన శైలిలో బాలయ్యకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసాడు. ట్విట్టర్ వేదికగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసిన ఎన్టీఆర్ గుండెలకి హత్తుకునే సందేశాన్ని ఇచ్చాడు.
ఎన్టీఆర్ ట్వీట్ చేస్తూ, నాలోని అభిమానిని తట్టిలేపింది మీరే. నా ఊహ తెలిశాక చూసిన మొట్టమొదటి హీరో మేరే. ఈ 60వ పుట్టినరోజు మీ జీవితంలో మరపురానిది కావాలని, మీరు ఆయురారోగ్యాలతో సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను బాబాయ్ అంటూ జై బాలయ్య అని ముగించాడు.