Advertisementt

నితిన్ సినిమాలో కీలక పాత్రలో బాలీవుడ్ హాట్ బ్యూటీ..?

Tue 09th Jun 2020 04:04 PM
shilpa shetty,tabu,andhadhun,nithin,ramya krishna,anasuya,rang de,keerthy suresh  నితిన్ సినిమాలో కీలక పాత్రలో బాలీవుడ్ హాట్ బ్యూటీ..?
Bollywood hot beauty in Nithins Remake.. నితిన్ సినిమాలో కీలక పాత్రలో బాలీవుడ్ హాట్ బ్యూటీ..?
Advertisement
Ads by CJ

గత కొన్ని రోజులుగా విజయాలు లేక అల్లల్లాడుతున్న హీరో నితిన్ కి భీష్మ రూపంలో సాలిడ్ హిట్ పడింది. వెంకీ కుడుముల దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీసు వద్ద తన సత్తా చాటింది. అయితే ఈ సినిమా అనంతరం నితిన్ రంగ్ దే సినిమాని చేస్తున్నాడు. మహానటి ద్వారా దేశవ్యాప్తంగా పేరు తెచ్చుకున్న కీర్తి సురేష్ ఈ సినిమాలో హీరోయిన్ గా కనిపిస్తుంది. అయితే ఈ సినిమాతో పాటు నితిన్ చేతిలో మరో సినిమా కూడా ఉంది.

బాలీవుడ్ లో సంచలన విజయం సాధించిన అంధాధున్ చిత్ర రీమేక్ హక్కులని కొనుక్కున్న నితిన్, మేర్లపాక గాంధీ దర్శకత్వంలో ఈ సినిమాని పట్టాలెక్కించనున్నాడు. ప్రియాంకా మోహన్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటించనుంది. ఆయుష్మాన్ ఖురానా హీరోగా నటించిన అంధాధున్ సినిమాలో సీనియర్ హీరోయిన్ టబు కీలక పాత్రలో మెరిసింది. సినిమా మొత్తం ఆ పాత్ర ఆధారంగానే మలుపు తిరుగుతుంది. అదీ గాక కొద్దిగా బోల్డ్ గా కూడా ఉంటుంది.

అంతటి ఇంపార్టెన్స్ ఉన్న ఆ పాత్రని తెలుగులో ఎవరు చేస్తారనేది సస్పెన్స్ గా మారింది. మొదటగా టబు, యాంకర్ అనసూయ, రమ్యక్రిష్ణల పేర్లు వినిపించినప్పటికీ, వారెవరూ ఫైనలైజ్ అవలేదు. తాజాగా ఈ పాత్ర పోషించదానికి బాలీవుడ్ ఎవర్ గ్రీన్ హాట్ బ్యూటీ శిల్పాశెట్టిని అడిగారని సమాచారం. శిల్పా కూడా పాజిటివ్ గానే స్పందించారని అంటున్నారు. ఇదే గనక నిజమైతే సినిమాకి మరింత మైలేజి వచ్చినట్టే. 

Bollywood hot beauty in Nithins Remake..:

Bollywood hot beauty in Nithins Remake..

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ