Advertisementt

మళయాల చిత్ర రీమేక్ లో రానా- రవితేజ..?

Tue 09th Jun 2020 03:03 PM
rana,raviteja,ayyappa koshiyum,pruthvi raj,biju menon,malayalam,telugu remake,telugu  మళయాల చిత్ర రీమేక్ లో రానా- రవితేజ..?
Rana- Raviteja will team up for Remake..? మళయాల చిత్ర రీమేక్ లో రానా- రవితేజ..?
Advertisement
Ads by CJ

గత కొన్ని రోజులుగా మళయాల చిత్రమైన అయ్యప్పనుం కోషియం సినిమాని తెలుగులో రీమేక్ చేస్తారని వార్తలు వస్తూనే ఉన్నాయి. ఈ సినిమా హక్కులని కొనుక్కున్న సితార ఎంటర్ టైన్ మెంట్స్  దర్శకుడి కోసం వెతుకుతోంది. ఒరిజినల్ సినిమాలో ఉన్న ఇంటెన్సిటీని రీ క్రియేట్ చేసే సత్తా ఉన్న దర్శకుడి కోసం సెర్చ్ చేస్తోంది. అయితే ఈ రీమేక్ లో నటించే హీరోలెవరనేది మాత్రం వెల్లడి చేయలేదు.

తాజాగా ఈ సినిమాలోని రెండు ప్రధాన పాత్రల్లో రానా, రవితేజ లని నటింపజేయాలని చూస్తోందట. ఇప్పటికే రానా ఈ సినిమా కథ విని పాజిటివ్ గా స్పందించాడట. అటు రవితేజ కూడా సానుకూలంగానే ఉన్నాడని సమాచారం. ఈ క్రేజీ కాంబినేషన్ కలిస్తే సినిమాకి మరింత హైప్ చేకూరుతుందని సితార ఎంటర్ టైన్ మెంట్స్ భావిస్తోంది. మరి అన్నీ కుదిరి ఈ సినిమా తెరకెక్కాలంటే సంవత్సరానికి పైగానే టైమ్ పడుతుంది.

ఒక్క తెలుగులోనే కాదు అటు బాలీవుడ్ సైతం ఈ సినిమాని రీమేక్ చేయాలని చూస్తోంది. ఇటు తమిళ ఇండస్ట్రీ కూడా అన్నదమ్ములైన సూర్య, కార్తీలను పెట్టి ఈ సినిమాని రీమేక్ చేయాలని చూస్తోంది. మరి ఇంత క్రేజ్ ఉన్న ఈ సినిమా తెలుగు రీమేక్ లో నటించి ప్రేక్షకులకి ఆనందాన్ని పంచే అదృష్టం ఎవరికి రానుందో..!

Rana- Raviteja will team up for Remake..?:

Rana- Raviteja will team up for Ayyappanum Koshiyum

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ