Advertisementt

అటు ఇటు తిరిగి మళ్ళీ మొదటికే వచ్చిన మాస్ డైరెక్టర్..

Tue 09th Jun 2020 02:43 PM
vv vinayak,seenayya,dil raju,telugu,telugu film industry  అటు ఇటు తిరిగి మళ్ళీ మొదటికే వచ్చిన మాస్ డైరెక్టర్..
VV Vinayak wants a young hero for.. అటు ఇటు తిరిగి మళ్ళీ మొదటికే వచ్చిన మాస్ డైరెక్టర్..
Advertisement
Ads by CJ

యాక్షన్ సినిమాల్లో కామెడీని మిక్స్ చేసి సూపర్ హిట్ అందించడంలో వివి వినాయక్ ని మించినవాళ్లెవరూ లేరని చెప్పవచ్చు. ఆయన దర్శకత్వం వహించిన సినిమాలని గమనిస్తే ఒక పక్క ఎంత మాస్ సీన్స్ ఉంటాయో మరో పక్క  నవ్వించే సీన్స్ కూడా అంతే ఉంటాయి. అయితే అప్పట్లో ఈ ఫార్ములా సక్సెస్ అయ్యి టాప్ లోకి చేరాడు. గత కొన్ని రోజుల నుండి వివి వినాయక్ కెరీర్లో సరైన హిట్ లేదు.

మెగాస్టార్ చిరంజీవి రీ ఎంట్రీ సినిమా ఖైదీ నంబర్ 150 సినిమాతో మళ్ళీ ట్రాక్ లోకి వచ్చాడని అనిపించినా ఇంటిలిజెంట్ సినిమాతో తీవ్రంగా నిరాశపర్చాడు. దాంతో ఈ సీనియర్ డైరెక్టర్ ఔట్ డేటెడ్ అయిపోయాడని వార్తలు వచ్చాయి. ఈ క్రమంలో వినాయక్ సైతం నటన వైపు రావడంతో ఈ వార్తలకి బాగా బలం చేకూరినట్టయింది. అయితే వివి వినాయక్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న సీనయ్య సినిమా ఏవో కారణాల వల్ల ఆగిపోయిందట.

దాంతో మళ్లీ వివి వినాయక్ దర్శకుడిగా తన ప్రయత్నం మొదలు పెట్టాడు. లాక్డౌన్ టైమ్ లో కథ రెడీ చేసుకున్న వినాయక్ హీరో కోసం వెతుకుతున్నాడట. యంగ్ హీరోకి సరిపడు కథని తెరకెక్కించడానికి ట్రై చేస్తున్నాడట. మరి వినాయక్ తో సినిమా చేసే హీరో ఎవరనేది చూడాలి.

VV Vinayak wants a young hero for..:

VV Vinayak wants a young hero for..

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ