Advertisementt

BB3 ఫస్ట్ రోర్‌తో అద‌ర‌గొట్టిన నటసింహం

Wed 10th Jun 2020 03:07 AM
balakrishna,boyapati,movie teaser,first roar,bb3 movie first roar,bb3 teaser,nandamuri  BB3 ఫస్ట్ రోర్‌తో అద‌ర‌గొట్టిన నటసింహం
Balakrishna and Boyapati 3 Movie Teaser Released BB3 ఫస్ట్ రోర్‌తో అద‌ర‌గొట్టిన నటసింహం
Advertisement

ఎదుటివాడితో మాట్లాడేట‌ప్పుడు ఎలా మాట్లాడాలో నేర్చుకో..అంటూ #BB3 ఫస్ట్ రోర్‌తో అద‌ర‌గొట్టిన న‌ట‌సింహ బాల‌కృష్ణ‌.

‘సింహా’, ‘లెజెండ్’ వంటి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్స్ త‌ర్వాత‌ నటసింహ నందమూరి బాలకృష్ణ, మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేష‌న్‌లో హ్యాట్రిక్ మూవీ #BB3 రూపొందుతోంది. మిర్యాల స‌త్య‌నారాయ‌ణ రెడ్డి స‌మ‌ర్ప‌ణ‌లో ద్వారక క్రియేషన్స్ బ్యానర్ పై యువ నిర్మాత మిర్యాల రవీందర్ రెడ్డి అత్యంత ప్రెస్టీజియస్ గా ఈ మూవీని నిర్మిస్తున్నారు. నటసింహ నందమూరి బాలకృష్ణ పుట్టిన‌రోజు కానుక‌గా #BB3 ఫస్ట్ రోర్ పేరుతో ఓ ప‌వ‌ర్‌ఫుల్ లుక్‌తో కూడిన టీజ‌ర్‌ని విడుద‌ల చేసింది చిత్ర యూనిట్‌.

తెలుగుదనం ఉట్టిపడేలా పంచెకట్టుతో రాజ‌సంగా న‌డిచివ‌స్తున్న‌ బాలయ్య ఎంట్రీ అదిరిపోయింది. ‘‘ఎదుటి వాడితో మాట్లాడేట‌ప్పుడు ఎలా మాట్లాడాలో నేర్చుకో.. శ్రీ‌ను గారు మీ నాన్నగారు బాగున్నారా? అనే దానికీ, శ్రీ‌ను గారు మీ అమ్మ మొగుడు బాగున్నాడా? అనే దానికి చాలా తేడా ఉందిరా...’’ అని న‌ట‌సింహ నంద‌మూరి బాల‌కృష్ణ చెప్పే ప‌వ‌ర్‌ఫుల్ డైలాగ్ ఫ్యాన్స్ ను విప‌రీతంగా ఆక‌ట్టుకుంటోంది. థ‌మ‌న్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అదిరిపోయింది.  బాలయ్య బోయపాటి కాంబినేషన్ లో వస్తున్న ఈ చిత్రం, ప్రేక్షకులు, అభిమానులు ఎక్స్‌పెక్ట్ చేస్తున్న స్థాయిలో మోస్ట్ పవర్ఫుల్ గా మంచి కథా బలంతో పాటుగా చాలా గ్రాండియర్ గా తెరకెక్కుతోంది. ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న#BB3కి సంబందించిన మరిన్ని వివరాలు త్వరలో తెలియ‌జేయ‌నున్నారు.

నటసింహ నందమూరి బాలకృష్ణ హీరోగా నటిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: సి. రాంప్రసాద్‌, సంగీతం: థమన్‌ ఎస్‌‌, మాటలు: ఎం.రత్నం, ఆర్ట్‌ డైరెక్టర్‌: ఎ.ఎస్‌.ప్రకాష్‌, ఎడిటింగ్‌: కోటగిరి వేంకటేశ్వరరావు, తమ్మిరాజు, ఫైట్స్‌: రామ్‌-ల‌క్ష్మ‌ణ్‌, స‌మ‌ర్ప‌ణ‌: మిర్యాల స‌త్య‌నారాయ‌ణ రెడ్డి, నిర్మాత: మిర్యాల రవీందర్‌రెడ్డి, దర్శకత్వం: బోయపాటి శ్రీను.

Click Here for Teaser

Balakrishna and Boyapati 3 Movie Teaser Released:

Balakrishna and Boyapati 3 Movie Teaser Review

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement